Share News

kumaram bheem asifabad- ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:16 PM

జిల్లాలో ఇళ్లగణన కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం ఆసిఫాబాద్‌ మండలంకు చెందిన ఎన్యుమరే టర్లు, సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రణాళికాధికారి వాసుదేవరెడ్డితో కలిసి కలెక్టర్‌ హరిత హాజరయ్యారు.

kumaram bheem asifabad- ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

-ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇళ్లగణన కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం ఆసిఫాబాద్‌ మండలంకు చెందిన ఎన్యుమరే టర్లు, సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రణాళికాధికారి వాసుదేవరెడ్డితో కలిసి కలెక్టర్‌ హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణన -2027లో భాగంగా మొదటి విడతలో ఇళ్ల గణన కార్యక్రమం వచ్చే నెల 11 నుంచి జిల్లాలో ప్రారంభమవుతుందని చెప్పా రు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇళ్ల గణన సమయంలో ఇంటి యజమానికి 32 ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి డిజిటల్‌ పద్ధతిలో ఇళ్ల గణన ఉంటుందని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇళ్ల గణన కార్యక్రమం చేపట్టాలన్నారు. శిక్షకులు చెప్పే ప్రతీ అంశంను శ్రద్ధగా విని నోట్‌ చేసుకోవాలన్నారు. ఏదైనా అంశం అర్థంకాక పోతే శిక్షకులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇళ్లగణన కోసం 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. వీరే కాకుండా ఆపరేటర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలో 1,689 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌గా గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి సంబంధించి సూపర్‌వై జర్లు, ఎన్యుమరేటర్లు జనగణన పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన వెంట ఎంఈవో సుభాష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గజానంద్‌ తదితరులు ఉన్నారు..

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జనగనణ కార్యక్రమంపై శిక్షణ నిర్వహిం చారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు జనగనణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. శిక్షణలో ప్రతీ అంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గోవింద్‌, గిర్దావర్‌ పవన్‌నాయక్‌, శేవంత, టీఏ సోము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో వచ్చే నెల 11 నుంచి జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్లకు జిల్లా క్షేత్ర శిక్షకులు అబ్దుల్‌ ఖమర్‌, రాజకమలాకర్‌రెడ్డిలు శనివారం కార్యక్రమం లో శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనగణన పకడ్బంధీగా సర్వే చేపట్టాలని సూచించారు. సర్వేలో కుటుంబ వివరాలు సమగ్రంగా పొందుపర్చాలని వివరించారు.

Updated Date - Apr 18 , 2026 | 11:16 PM