Share News

kumaram bheem asifabad- ఇళ్లగణన పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 10:43 PM

జిల్లాలో జనగణన 2027లో భాగంగా మొదటి విడత ఇళ్లగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి చార్జ్‌ అధికారులు, ఫీల్డ్‌ అధికారులు, సాంకేతిక సిబ్బందికి మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

kumaram bheem asifabad- ఇళ్లగణన పకడ్బందీగా చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనగణన 2027లో భాగంగా మొదటి విడత ఇళ్లగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి చార్జ్‌ అధికారులు, ఫీల్డ్‌ అధికారులు, సాంకేతిక సిబ్బందికి మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణన కార్యక్రమంలో భాగంగా చార్జీ అధికారులుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు తమ పరిధిలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సిబ్బందికి సూచనలు చేస్తూ విజయవంతంగా కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ప్రయోజనం

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకంతో మహిళలకు ప్రయోజనం జరుగుతుందని కలెక్టర్‌ హరిత అన్నారు. ఆసిఫాబాద్‌ బస్టాండ్‌లో మంగళవారం మహాలక్ష్మి పథకం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్‌ 9న ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిందని చెప్పారు. మార్చి 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయా ణ సేవలు, 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూరైన సందర్భంగా ప్రభుత్వం అన్ని బస్టాండ్‌లలో విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్‌ రాజశేఖర్‌, అసిస్టెంబట్‌ మేనేజర్‌ దేవపాల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 10:43 PM