kumaram bheem asifabad- ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:14 PM
జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులకు ఆదివారం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలసి హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అదికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఆసిఫాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులకు ఆదివారం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలసి హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అదికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026 సంవత్సరంలో మొదటి విడతలో ఇళ్ల గణన కార్యక్రమాన్ని పూర్తి డిజిటలైజేషన్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్ ద్వారా చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదు చేసి ఇండ్ల జాబితా రుపొందిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు నిర్వహిస్తారని చార్జ్ అధికారులుగా తహసీల్దార్లు, అదనపు ఇన్‌చార్జి అధికారులుగా ఎంపీడీవోలు వ్యవహరిస్తారని తెలిపారు. సెన్సెక్స్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. మాస్టార్ ట్రైనర్లు వివరించే ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇళ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రకారం జాబితా రూపొందించాలని తెలిపారు. ఈనెల 17 వరకు నిర్వహించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతీ ఆంశాన్ని నేర్చుకుంటూ ఏమైనా అనుమానాలు ఉన్నట్లాయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి గురువయ్య, జిల్లా సెన్సెస్ అధికారులు వినయ్, గంగయ్య, మాస్టార్ ట్రైనీలు ఊశన్న, తహసిల్థార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.