తుది దశకు ఆస్పత్రి భవనం...
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:02 AM
వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లాకు మంజూరైన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి శాశ్వత భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
-350 పడకలతో వైద్య కళాశాలకు అనుబంధం
-రూ. 129 కోట్ల అంచనా వ్యయం
-ఈ నెలాఖరుతో పూర్తికానున్న నిర్మాణ లక్ష్యం
మంచిర్యాల, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లాకు మంజూరైన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి శాశ్వత భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మంచిర్యాల జిల్లాగా ఏర్పడ్డ తరువాత మెడికల్ కళాశాలతో పాటు దానికి అనుబంధంగా 350 పడకల ఆస్పత్రి భవనాలు మంజూరయ్యాయి. ఆస్పత్రి శాశ్వత భవన నిర్మాణానికి జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులోని పాత బీట్ మార్కెట్ యార్డు ఆవరణలో స్థలం కేటాయించారు. రూ. 129.25 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా, మొత్తం మూడంతస్తులతో కూ డిన ఆస్పత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దాదా పు 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. స్థలం కేటాయిం పు, అందులోని ఇతర కట్టడాలు తొలగించడంలో జాప్యం కార ణంగా ఆస్పత్రి భవన నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
మెరుగుపడనున్న వైద్య సేవలు...
నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ప్రభుత్వపరంగా రోగులకు వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. ఇప్పటి వరకు స్థానిక ఐబీ చౌరస్తా సమీపంలోగల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో 200 పడకలతో రోగులకు చికిత్స అందుతుండగా, అరకొర సౌకర్యాల నడుమ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రోగుల సంఖ్యకు సరిపడా బెడ్లు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయి లో అందుబాటులో లేక కొంతమేర ఇబ్బందులు తప్పడం లే దు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై జిల్లా వాసులతో పాటు పొరుగు జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని సిరొంచ, తదితర ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు పొందుతు న్నారు. దీంతో నిత్యం సగటు ఔట్ పేషెంట్ల సంఖ్య 200 వర కు ఉంటుంది. ఆస్పత్రిలో దాదాపు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఆర్థో, గైనకాలజీ, చిల్డ్రన్ విభాగంలో సేవలకు ప్రజాధారణ అధికంగా ఉంటుం ది. అయితే ఆస్పత్రిలో అందుతున్న చికిత్సలకు అనుగుణంగా భవనంలో స్థలాభావం కారణంగా రోగులు ఇబ్బందులు పడు తున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే అధునాతన సౌకర్యాలతోపాటు నిపుణులతో అత్యున్నతస్థాయి వైద్య చికిత్స లు అందే అవకాశాలు ఉన్నాయి. నూతన ఆస్పత్రిలో రూ. 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తు న్నందున అత్యవసర సమయాల్లోనూ స్థానికంగానే చికిత్స అందే అవకాశాలు ఉన్నాయి.
అందుబాటులోకి వైద్య కళాశాల...
జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తికావడంతో విద్యార్థులను అక్కడికే తరలించి తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇంతకాలం తాత్కాలికంగా రేకుల షె డ్డులో అరకొర సౌకర్యాల మధ్య ఇబ్బందులు పడ్డ వైద్య విద్యా ర్థులకు ఆ తిప్పలు తప్పినట్లయింది. వైద్య కళాశాలకు శాశ్వత భవన నిర్మాణ కోసం అవసమైన స్థలాన్ని హాజీపూర్ మండ లం గుడిపేట సమీపంలో కేటాయించారు. వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు 2024 ఆగస్టులో అ గ్రిమెంట్ పూర్తికాగా 2026 మార్చి 30 వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. వైద్య కళాశాల భవనానికి రూ. 216 కోట్ల అంచనా వ్యయంతో డాస్ ఇంజనీరింగ్ కంపెకి నిర్మాణ బాధ్య తలు అప్పగించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులను నాలు గు విభాగాలుగా చేపట్టారు. ఇందులో భాగంగా బాయ్స్ హా స్టల్‌ను జి+6లో ఏర్పాటు చేయగా, గర్ల్స్ హాస్టల్ జి+7, కళా శాల భవనం జి+3, ప్రిన్సిపాల్ క్వార్టర్‌తోపాటు గెస్ట్ హౌజ్‌ను జి+2లో నిర్మించారు. వైద్య కళాశాల పనులు దాదాపుగా పూ ర్తికాగా, అనుబంధ ఆస్పత్రి పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి కావలసి ఉంది.
రహదారితోనే ఇబ్బందులు....
కాలేజి రోడ్డులో 350 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు ఏర్పడే అవకా శాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మితమవుతున్న ఆస్పతి భవనా నికి వెళ్లాలంటే ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నుంచి కాలేజ్ రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరుకైన రోడ్డు కావడం, విపరీతమైన వాహనాల రద్దీ ఉండటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ప్రారంభ మై తే వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రోగు లు, వారి బంధువుల రాకతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెర నుంది. పైగా ఓవర్ బ్రిడ్జి కింద నుంచి వాహనాల రాకపోకల కు తరుచుగా అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ స్పత్రి భవన నిర్మాణ స్థలం అన్ని వర్గాల ప్రజలకు అందు బా టులో ఉన్నప్పటికీ విశాలమైన రహదారి సౌకర్యం కూడా కల్పి స్తే సౌకర్యవంతంగా ఉంటుందని, ఈ విషయమై ప్రజా ప్రతి నిధులతోపాటు ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.