Share News

kumaram bheem asifabad-‘చేయూత’పై ఆశలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:34 PM

చేయూత పథకంలో భాగంగా కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించ డంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరి సారిగా 2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పిం ఛన్లు మంజూరు కాలేదు

kumaram bheem asifabad-‘చేయూత’పై ఆశలు
లోగో

- పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు

- ఆనందంలో అర్హులైన లబ్ధిదారులు

బెజ్జూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): చేయూత పథకంలో భాగంగా కొత్త పింఛన్లు ఈనెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించ డంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరి సారిగా 2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పిం ఛన్లు మంజూరు కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం దీని పై దృష్టి సారించడంతో దరఖాస్తుదారులు ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉండి ప్రభుత్వం అందజేసే సాయాన్ని పలువురు పొందడం లేదు. దీంతో వారంతా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. పలు కారణాల వల్ల కొత్తవారికి మంజూరు చేసే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా తీపిక బురు అందించింది. ఈ నెల 15నుంచి చేయూత పథకం ద్వారా కొత్తవి పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి అర్హుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఈ పథకం ద్వారా వృద్ధులు 22,731, వితంతువులు 21,333, దివ్యాంగులు 5,774, ఒంటరి మహిళలు 2,558, చేనేత కార్మికులు 473, గీత కార్మికులు 132, బీడీ కార్మికులు 88, ఫైలేరియా 554, డయాలసిస్‌ 102మందికి ఫించన్లు అందు తున్నాయి. ఇందుకోసం ఏటా ప్రభుత్వం కోట్ల రూ పాయలు వెచ్చిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా కేటగిరీల వారీగా వారికి ఫించన్‌ అందజేయగా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది.

- చివరి సారిగా..

చివరి సారిగా 2022 అక్టోబరులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పిం ఛన్లు మంజూరు కాలేదు. వ్యధ్యాప్య పింఛన్ల మం జూరుకు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ, ఆ మేరకు గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం సైతం రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్నది, 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా చేయూత పథకం కింద అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు, ఇతరత్రా పింఛన్లను 2,016 నుంచి 4,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే అదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి గత కేటగిరీల వారీగా కాకుండా కొత్తగా తలసేమియా, సికల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు కూడా ఫించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బాధితులను గుర్తించింది. కాగా ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛను పొందుతున్న వారు మరణిస్తే వారి స్థానంలో ఆ కుటుంబంలో అర్హత కలిగిన వారికి పింఛను మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే తరహాలో దివ్యాంగుడు మరణిస్తే ఆస్థానంలో జాప్యం చేయకుండా ఆ కుటుంబంలోని అర్హులను గుర్తించి పింఛను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కొత్త పింఛన్ల మంజూరుకు జిల్లా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పింఛన్‌ దారుల ముఖ గుర్తింపు నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. మర ణించిన వారు, వలసవెళ్లిన వారు, జీవించి ఉన్నవారి జాభితాను సిద్ధం చేస్తారు. గ్రామ సభల్లో వివరాలను వెల్లడించి కొత్తది రూపొందించనున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 10:34 PM