kumaram bheem asifabad- బస్ డిపో పనులపై ఆశలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:59 PM
కాగజ్‌నగర్ పట్టణంలో బస్ డిపో నిర్మాణ పనులపై ఆశలు చిగురిస్తున్నాయి. కాగజ్‌నగ ర్ బస్టాండు సమీపంలో బస్ డిపో కోసం గత పాతికేళ్ల క్రితమే ప్రభుత్వ స్థలం కేటాయించింది. ఈ స్థలం కేటాయించిన తర్వాత ప్రభుత్వాలు మారుతున్న కూడా ఈ డిపో ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించలేదు. సిర్పూరు నియోజకవర్గంలో ఏడు మండలా లు ఉన్నాయి, ఈ మండలాలకు పూర్తిగా రైల్వే మార్గం పూర్తి స్థాయిలో లేక పోవడంతో అంతా కూడా బస్సులు, ఆటోలు, జీపుల ద్వారా నిత్యం రాకపోకలు సాగించాల్సిన పరస్థితి నెలకొన్నది
కాగజ్‌నగర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో బస్ డిపో నిర్మాణ పనులపై ఆశలు చిగురిస్తున్నాయి. కాగజ్‌నగ ర్ బస్టాండు సమీపంలో బస్ డిపో కోసం గత పాతికేళ్ల క్రితమే ప్రభుత్వ స్థలం కేటాయించింది. ఈ స్థలం కేటాయించిన తర్వాత ప్రభుత్వాలు మారుతున్న కూడా ఈ డిపో ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించలేదు. సిర్పూరు నియోజకవర్గంలో ఏడు మండలా లు ఉన్నాయి, ఈ మండలాలకు పూర్తిగా రైల్వే మార్గం పూర్తి స్థాయిలో లేక పోవడంతో అంతా కూడా బస్సులు, ఆటోలు, జీపుల ద్వారా నిత్యం రాకపోకలు సాగించాల్సిన పరస్థితి నెలకొన్నది. సమయానికి మారు మూల గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సౌక ర్యం లేక పోడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. కాగజ్‌నగర్ పట్టణం లో పారిశ్రామిక ప్రాంత కావడం, గ్రామీణ ప్రాంతాల వాసులు నిత్యం కాగజ్‌నగర్ కేం ద్రానికి పనుల నిమిత్తం రాకపోకలు సాగి స్తుంటారు. కానీ సమయానికి మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక పోడంతో ఇబ్బం దులు పడుతున్నారు. పక్షం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. జిల్లాలోనే అధికంగా ఆదా యం ఉండే కాగజ్‌నగర్‌కు బస్సు డిపో సౌకర్యం లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు సభా దృష్టికి తెచ్చారు. కాగజ్ నగర్ నుంచి సిర్పూరు నియోజకవర్గానికి అన్ని మార్గాలకు వెళ్లేంతకు చక్కటి సౌకర్యం ఉంటుందని, తమకు డిపో కావాలని ఈ విషయంలో ఆర్టీసీ డీఎం దృష్టికి కూడా లిఖిత పూర్వకంగా రాసి వినతిపత్రాన్ని కూడా అందజేశారు. బస్ డిపో ఏర్పాటు జరిగితే గిరిజన గ్రామాలకు నేరుగా వెళ్లేందుకు చక్క టి మార్గం ఉంటుంది. ఉదయం భాగ్యనగర్ ద్వారా హైదరాబా ద్‌కు వెళ్లేందుకు సిర్పూరు(టి), కౌటాల, బెజ్జూరు, దహెగాం, చింతలమానేపల్లి, కాగజ్‌నగర్ మండలాల నుంచి ప్రజలు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రాత్రి బస చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
- నియోజవర్గ పరిధిలో..
కాగజ్‌నగర్‌లో డిపో ఏర్పాటు చేస్తే సిర్పూరు నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, సిర్పూరు(టి), బెజ్జూరు, కౌటాల, చింతల మానేపల్లి, దహెగాం, పెంచికల్‌పేట్ మండ లాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలకు రవా ణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఈ మండలా ల్లో గిరి గ్రామాలున్నాయి. నిత్యం వివిధ అవసరాల కోసం కాగజ్‌నగర్‌కు వస్తుంటారు. బస్సులు సకాలంలో రాక పోవడంతో వీరంతా ఆటోలు, జీపుల్లో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగజ్‌నగర్ డిపో ఏర్పాటు చేస్తే ఈ గ్రామాలకు నేరుగా బస్సు లను పంపించేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ డిపో నుంచి కాగజ్ నగర్ బస్టాండుకు బస్సులు రావాల్సి ఉంటుం ది. కాగజ్‌నగర్‌కు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బస్సులను వివిధ రూట్లలో ఆయా గ్రామాలకు పంపించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సు లు సకాలంలో ఆయా గ్రామాలకు పంపించ లేని పరిస్థితి ఉందని వివిధ మండలాల వాసులు వాపోతున్నారు. కాగజ్ నగర్ బస్ డిపో ఏర్పాటు చేస్తే అన్ని మండలాలకు బస్సు సౌకర్యం కల్పించటమే కాకుండా సమీ ప మహారాష్ట్ర్ట్రకు కూడా సిర్పూరు(టి), చింత లమానేపల్లి. కౌటాల, బెజ్జూరు మండలాల మీదుగా బస్సు సౌకర్యం సైతం కలిగించే అవకాశం ఉంది. బస్సు డిపో స్థలం ఆక్రమణకు గురవుతుండడంతో గతంలో అధికారులు సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేశారు. అలాగే కాగజ్‌నగర్ నుంచి ఆయా మండలాలకు వారసంతలకు వెళ్లే వ్యాపారు లు బస్సు సౌకర్య కల్పిస్తే బాగుంటుందని చెబుతున్నారు. దీంతో మరింత ఆర్టీసీ ఆదా యం పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజ లు కోరుతున్నారు.