kumaram bheem asifabad- కొత్త పాలక వర్గంపై ఆశలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:32 PM
కాగజ్‌నగర్‌లో నూతన పాలకవర్గంపైనే పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు, బీజేపీ కౌన్సిలర్లు సహకారం అందించారు. ప్రతి పక్షాల వ్యూహాలను అధిగమించి కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నది. ఇప్పుడు 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలను కొత్త పాలక వర్గ సభ్యులపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు
- మాస్టర్ ప్లాన్ అమలుకు నిరీక్షణ
- పెండింగ్‌లోనే కూడళ్ల విస్తరణ
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో నూతన పాలకవర్గంపైనే పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు, బీజేపీ కౌన్సిలర్లు సహకారం అందించారు. ప్రతి పక్షాల వ్యూహాలను అధిగమించి కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నది. ఇప్పుడు 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలను కొత్త పాలక వర్గ సభ్యులపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ బకాయిలు రూ.2 కోట్ల మేర పెండింగ్‌లోనే ఉంది. ఈ బిల్లుల చెల్లించాలని గతంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలు చేపట్టారు. కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి సమస్యలు పరిష్కరించడమే అధికార పార్టీకి ఇప్పుడు కత్తిమీద సాముల మారింది. ఏ చిన్న తప్పిదం జరిగిన కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయిలో బలం ఉండడంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా తమ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఒక వైపు అనైతిక పొత్తు, మరో వైపు ప్రతి పక్షాల ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అధికార పార్టీ ఎలా ముందడుగు వేస్తోందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పట్టణంలో తాగునీటి ఎద్దడి, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి, కూడళ్ల విస్తరణ, మాస్టర్ ప్లాన్ అమలు, తదితర కీలక సమస్యల పరిష్కారం చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు అన్ని మున్సిపాల్టీలకు విడుదల చేయక పోవటం పెద్ద సమస్యగా మారింది. గత బీఆర్‌ఎస్ హయాంలో ప్రతీ నెల పట్టణాభివృద్ధికి రూ.5 కోట్ల నిధులను విడుదల చేసేది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి నిధులు విడుదల చేయటం లేదు. మున్సిపాల్టీల అభివృద్ధి ఆశించిన మేర జరుగడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం విడుదల ఎంపిక చేసిన అమృత్ భారత్ 2.0, ప్లానింగ్ గ్రాంటు, తదితర నిధులు విడుదల అవుతున్నాయి. ఈ నిధులతోనే అన్ని మున్సిపాల్టీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నెలకొన్న కీలక సమస్యలు అధికార పార్టీ ఎలా పరిష్కరిస్తుందోనని అంతా వేచి చూస్తున్నారు.