Share News

kumaram bheem asifabad- ‘యువ వికాసం’పై చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:26 PM

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకానికి శ్రీకా రం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలనేది దీని ఉద్దేశం. ఇందులో భాగంగా గత ఏడాది మార్చి 14వ తేదీ వరకు ‘మీసేవా’ ద్వారా దరఖాస్తులు స్వీకరిం చారు.

kumaram bheem asifabad- ‘యువ వికాసం’పై  చిగురిస్తున్న ఆశలు
లోగో

- మంజూరైన యూనిట్లు 8,879

నవంబరు 19 నుంచి సాయం

- నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు

బెజ్జూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకానికి శ్రీకా రం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలనేది దీని ఉద్దేశం. ఇందులో భాగంగా గత ఏడాది మార్చి 14వ తేదీ వరకు ‘మీసేవా’ ద్వారా దరఖాస్తులు స్వీకరిం చారు. ఆ తర్వాత నుంచి తదుపరి ప్రక్రియలో కద లిక కనిపించలేదు. జిల్లాకు 8,879 యూనిట్లు మం జూరు చేయాలనేది లక్ష్యం కాగా, జిల్లాలో 30,022 దరఖాస్తులొచ్చాయి. విచారణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

- తొలి విడతగా..

యువ వికాసం పథకం తొలి విడతగా నవంబరు 19 నుంచి లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని యువతలో ఆశలు చిగురింపజేస్తున్నాయి. వాస్తవానికి గత ఏడాది జూన్‌ 2వ తేదీనే యూనిట్ల రుణపత్రాలు అందిస్తారని భావించగా, అప్పట్లో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అప్పటి నుంచి మంజూరు ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేస్తారా? లేక మళ్లీ కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారా? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అధికార వర్గాల సమాచారం మేరకు గతంలో దరఖాస్తులు చేసుకున్న వారికే ప్రాదాన్యత ఉంటుందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్‌దే. గతంలో చేసిన దరఖాస్తులను పరిశీలిస్తారా అనేదానిపై పూర్తిస్థాయిలో స్పష్టత లేక నిరుద్యోగ యువతలో గందరగోళం నెలకొంది. మండల, మున్సిపల్‌, జిల్లాస్థాయి కమిటీల పరిశీలన ద్వారా తుది జాబితా కలెక్టర్‌కు అందజేస్తారని సమాచారం. ఈసారి మా త్రం యువ వికాసం లబ్ధిదారు లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్లు తెలు స్తోంది. నవంబరు తొలి వారంలోనే ఈ ప్రక్రియ పూ ర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలి పాయి.

ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం..

రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొలి నుంచి ఈ పథకం అమలుపై ఊరిస్తూ రావడంతో దరఖా స్తుదారుల్లో ఆందోళన నెలకొనగా, ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పథకం అమలుపై స్పష్టత ఇవ్వడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురింపజేస్తున్నాయి. నవంబరు 19నుంచి తొలి విడతలో ఎంపిక చేసిన యువతకు సాయం అందిస్తామని ప్రకటించడంతో పథకం అమలులో కదలిక వచ్చినట్టేనని తెలు స్తోంది. 2025జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్బంగా ముందుగా రూ.50వేల సా యం అందించాలని లక్ష్యం పెట్టుకో గా, పలు కారణాల దృష్ట్యా అమలు కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పథకం అమలుపై ఆశలు రేగుతున్నాయి.

జిల్లాలో యువ వికాసం వివరాలు..

వర్గం వచ్చిన దరఖాస్తులు మంజూరైన యూనిట్లు

ఎస్సీ 6,939 2,185

ఎస్టీ, 7,370 3,855

బీసీ 12,590 1,845

మైనార్టీ 2,677 499

క్రిస్టియన్‌ 33 25

ఈబీసీ/ఈడబ్ల్యూఎస్‌ 413 470

Updated Date - Sep 21 , 2026 | 10:26 PM