Share News

kumaram bheem asifabad- ‘తుమ్మిడిహెట్టి’పై చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:14 PM

ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మళ్లీ కదలిక మొదలైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణ హిత నదిపై బ్యారేజీ నిర్మించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రాధాన్యం రఇస్తోంది. గతంలో వివిధ కారణాలతో నిలిచి పోయిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేసు న్న ప్రయత్నాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కట్టడానికి తెలంగాణ చేసిన విజ్ఙప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు.

kumaram bheem asifabad- ‘తుమ్మిడిహెట్టి’పై చిగురిస్తున్న ఆశలు
లోగో

- మహారాష్ట్రతో ఇటీవల ముఖ్యమంత్రి చర్చలు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మళ్లీ కదలిక మొదలైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణ హిత నదిపై బ్యారేజీ నిర్మించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రాధాన్యం రఇస్తోంది. గతంలో వివిధ కారణాలతో నిలిచి పోయిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేసు న్న ప్రయత్నాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కట్టడానికి తెలంగాణ చేసిన విజ్ఙప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు. తమ రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడకపోతే 148 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తూ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్వేలో తేల్చారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని భావి స్తోంది. ప్రభుత్వ చర్యలు కొలిక్కి వస్తే ఎన్నో ఏళ్లు గా నిలిచిన పనులకు మోక్షం లభించనుంది. జల యజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో ప్రాణహి త- చేవెళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా 16.40 లక్షల ఎకరాలకు అందించాలన్న లక్ష్యంతో రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 20-11-2012లో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద పనులకు శంకుస్థాప న చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మొత్తం 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా అధి కారులు ప్రతిపాదనలు రూపొందించారు. అనంతర కాలంలో వివిధ కారణాలతో ప్రాజెక్టు పనులు ముందకు సాగలేదు.

- గతంలో 152 మీటర్ల ఎత్తుతో..

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని గతంలో 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని ప్రతిపాదిం చారు. అయితే మహారాష్ట్రలో ముంపు సమస్యలు తలెత్తు తాయన్న అభ్యంతరాలతో 2016లో రెండు రాష్ట్రాల్లో మధ్య జరిగిన ఒప్పందంలో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు పరిమితం చేశారు. దీంతో తెలంగాణకు అవసరమైన మేరకు నీటిని వినియోగించుకోవడం లో ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యారేజీ ఎత్తు తిరిగి 152 మీటర్లకు పెంచాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ నెల 26న ముంబైలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశమైంది. ఈ భేటీలో నీటి లభ్యత, బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, రైతులకు పరిహా రం వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రతిపాదనను మరోసారి పరిశీలించేందుకు మాహారాష్ట్ర సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలపై అధ్యాయనం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములు, ప్రభావిత గ్రామాలు, పరిహారం తదితర అం శాలను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల నీటి పారు దల శాఖల ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారులు కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోనూ అవసరమైన సాంకేతిక అధ్యయనాలు చేపట్టనున్నారు.

- రూ.11వేల కోట్లు

కాగా ఈ ప్రాజెక్టు కోసం గతంలో రూ.11వేల కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు కూడా ప్రకటించారు. తుమ్మిడిహెట్టి నుంచి కాల్వల నిర్మాణంలో భాగంగా సుమారు 71.5 కిలోమీటర్ల మేర పనులు కూడా పూర్తి చేశారు. బ్యారేజీ నిర్మాణం, నీటి తరలింపు మార్గాలపై స్పష్టత వస్తే గతంలో చేపట్టిన పనులు వినియోగింలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. తుమ్డిహేట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ప్రాణహిత జలాలను తొలుత గ్రావీటి ద్వారా తరలించే అవకాశాలున్నాయి. దీంతో నీటిని ఎత్తి పోసేందుకు అవసరమయ్యే విద్యుత్‌ ఖర్చును తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తదుపరి నీటిని ఎల్లంపల్లి జలాశయానికి తరలించే ప్రతిపా దనపై కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ ధానం అమలు జరిగితే సాగునీటి నిర్వహణ వ్యయం తగ్గటంతో పాటు రైతులకు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కార్యరూపం దాలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరే అందే అవకాశాలున్నాయి. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు సాగు నీటి సదుపాయం మెరుగు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల పరిధిలోని వ్యవసాయ ప్రాంతాలకు ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలిగే అవకాశాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది పలువురు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు సాను కూలంగా సాగుతున్నప్పటికీ బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు సమస్యలు పర్యావరణ అను మతులు వంటి అంశాలు తుది నిర్ణయం రావాల్సి ఉంది. అధికారులు కమిటీ అధ్యాయనం, కేంద్ర జల సంఘం పరిశీలన అనంతరం ప్రాజెక్టు భవిష్యత్తు పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాణహిత జలాలు ఎప్పుడు త మ పొలాలకు చేరుతాయోనని రైతులు ఎదురుచూ స్తున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:14 PM