kumaram bheem asifabad-ఘనంగా హోలీ వేడుకలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:21 PM
జిల్లాలో పలు చోట్ల బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుకున్నారు. కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు నివాసంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ హోళీ పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. బీజేపి నాయకులు, కార్యకర్తలకు హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబురాలు జరుపుకున్నారు.
కాగజ్‌నగర్ టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు చోట్ల బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుకున్నారు. కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు నివాసంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ హోళీ పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. బీజేపి నాయకులు, కార్యకర్తలకు హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విశ్వేశ్వర్ రావు, మాజీ ఎంపిపి మనోహర్ గౌడ్, నాయకులు సిందం శ్రీనివాస్, చిప్పకుర్తి శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, పొలాడి హన్మంతరావు, చిలువేరు ప్రవీణ్, అరుణ్ లోయా తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు ఎల్లురు తదితర గ్రామల్లో హోలీ సంబరాలను చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్సై అనిల్‌కుమార్ గౌడ్ వేడుకల్లో పాల్గొని యువకులతో కలిసి నృత్యం చేశారు. మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంచందర్, రవీందర్, నాయకులు చంద్రమౌళి, నాగన్న, శంకర్‌గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో యువతీ యువకులు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మానిగూడ పంచాయతీలో గల రాంనగర్, అల్లిగూడ, జండాగూడ తదితర గ్రామాల్లో బుధవారం హోలీ వేడుకలను యువకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై మరోకరు రంగులు చల్లుకున్నారు. ఆదేవిధంగా ఇంటింటికి జాజిరి ఆడుతూ ఆటలు పాటలు, డప్పుల చపుళ్ళ మధ్య నృత్యాలు చేశారు. మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా కొన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహించలేదు. కార్యక్రమంలో నాయకులు దయాకర్, జాదవ్ గణపత్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంతో పాటు మండలంలోని తండాలు, గూడాల్లో హోలీ పండుగను ప్రజలు ఆటా పాటలతో ఘనంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు.