Share News

kumaram bheem asifabad- హోలీ.. సంబరాల కేళి

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:25 PM

జిల్లా వ్యాప్తంగా మంగళవారం హోలీ సంబ రాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువకలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాడవాడలా రంగులు చల్లుకుంటూ కేరింతలతో నృత్యం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

kumaram bheem asifabad- హోలీ.. సంబరాల కేళి
లి వేడుకల్లో నృత్యం చేస్తున్న ఎస్పీ నితికా పంత్‌

- ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు, యువకులు

జిల్లా వ్యాప్తంగా మంగళవారం హోలీ సంబ రాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువకలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాడవాడలా రంగులు చల్లుకుంటూ కేరింతలతో నృత్యం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): . జిల్లాలో కేంద్రంలోని పలు కాలనీల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సావాల్లో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం కామదహనం నిర్వహించి మరుసటి రోజు హోలీ వేడుకలు చేయడం పరిపాటి. పట్టణంలోని రావులవాడ, టీఆర్‌నగర్‌, సందీప్‌నగర్‌, పైకాజీనగర్‌, జన్కాపూర్‌, దస్నాపూర్‌ ప్రాంతాల్లో చిన్న పిల్లలు, మహిళలు, యువకులు రంగులు చల్లుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జల్లా ఎస్పీ నితికా పంత్‌, డీఎఫ్‌వోనీరజ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, సీఐ బాలాజీ వరప్రసాద్‌లు హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా హోలీ సంబరాలను చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం హోలీ సంబరాలను ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు రోడ్డుపైకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాన రహదారిపై డప్పు చప్పు లతో డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంగళవా రం ఈ పండుగను పిల్లలు, పెద్దలు, మహిళలు ఉత్సాహ భరిత వాతావరణంలో ఆనందోత్సావాలతో జరుపుకున్నారు. ఆదివాసీల జాజిరీ కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, మాజీ సహకార చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌ , మాజీ సర్పంచ్‌ మడావి భీంరావ్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో రంగుల పండుగ హోలీని ఆదివాసీలు తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకున్నారు. ఉదయం నుంచే డోలు, సన్నాయి నాదాలు మార్మోగి పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. యువకులు సంప్రదాయం ప్రకారం గుంపులుగా చేరి నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలో హోలీ పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. . యువత, పిల్లలు, ప్రత్యేకంగా ఉత్సాహం చూపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి సంతోషాన్ని పంచు ున్నారు. మహిళలు సంప్రదాయ వంటకాలు తయారు చేసి పండగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పార్వతిపేట, కుంచెవెల్లి, దహెగాం, ఇట్యాల, హత్తి ని, మాడవెల్లి, కల్వాడ, కమ్మర్‌పల్లి తదితర గ్రామా ల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఆటపాట లతో కామదహనం నిర్వహించారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో కామదాహనం నిర్వహించారు.

చింతలమానేపల్లి. (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉదయం నుంచే గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. యువత, పిల్లలు, ప్రత్యేకంగా ఉత్సాహం చూపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి సంతోషాన్ని పంచుకున్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి కామ దహనం కార్యక్రమం జరుపుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే హోలీ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని తమ స్నేహితురాళ్లకు, బంధువులకు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సమీప వాగులు, కుమరం భీం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లలో స్నానాలు చేసి వింధు భోజనాలు చేశారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): హోలీ సందర్భంగా పలు గ్రామాల్లో కామదాహనం నిర్వహించారు మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాల మధ్య జరుపు కున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలో యువత, పిల్లలు, ప్రత్యేకంగా ఉత్సాహం చూపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి సంతోషాన్ని పంచుకున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల డీజే పాటలతో యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు సంప్రదాయ వంటకాలు తయారు చేసి పండగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 10:25 PM