‘హెచ్‌ఎండీఏ ప్రణాళిక’లో భారీ మార్పులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:18 AM
హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగాన్ని పటిష్టం చేస్తూ కమిషనర్ సర్ఫరాజ్ ఆహ్మద్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు మెరుగైన సేవల కోసం అధికారాలను వికేంద్రీకరణ చేపట్టారు.
విస్తరణకనుగుణంగా ఐదుగురు డైరెక్టర్లు.. మెరుగైన సేవలకు అధికారాల వికేంద్రీకరణ
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగాన్ని పటిష్టం చేస్తూ కమిషనర్ సర్ఫరాజ్ ఆహ్మద్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు మెరుగైన సేవల కోసం అధికారాలను వికేంద్రీకరణ చేపట్టారు. ఇప్పటికే ఉన్న ఇద్దరు డైరెక్టర్లకు తోడుగా మరో ఇద్దరు సీపీవోలకు డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. వారి సేవల వినియోగంతో పాటు డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ నుంచి డిప్యూటేషన్‌పై మహిళా డైరెక్టర్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. వీరికి జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నుంచి వచ్చే పది అంతస్తులకుపైగా భవనాలు, అన్ని రకాల లేఅవుట్ అనుమతులు జారీ చేసే అవకాశం కల్పించారు.