చారిత్రక ఘట్టం.. రైతాంగ సాయుధ పోరాటం
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:38 PM
తెలంగాణ ప్రజలు దొరల, భూస్వాముల దోపిడీకి వ్య తిరేకంగా సాగించిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. బాలనరసింహ అన్నారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. బాలనరసింహ
పెద్దకొత్తపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రజలు దొరల, భూస్వాముల దోపిడీకి వ్య తిరేకంగా సాగించిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. బాలనరసింహ అన్నారు. బుధవా రం మండల కేంద్రంలోని అమర వీ రుల స్తూపం దగ్గర తెలంగాణ రై తాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘ నంగా నిర్వహించారు. బాలనరసింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌లు మాట్లా డుతూ తెలంగాణ పోరాటంలో దాదాపు 3వేల గ్రామాల నుంచి దొరలను తరిమి కొట్టిన ఘన చరిత్ర ఉందని అన్నారు. సెప్టెంబరు 17న విలీ న దినోత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పో రాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరా టంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నా యని వాటిని మానుకోవాలన్నారు. కార్యక్రమం లో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.న రసింహ, పెబ్బేటి విజయుడు, బండి లక్ష్మీపతి, లక్ష్మణస్వామి, కే.సుదర్శన్‌రెడ్డి, సంఘం కృష్ణ, రాధాకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.