హిందువులు ఐక్యంగా ఉండాలి..
ABN , Publish Date - May 13 , 2026 | 01:17 AM
హిందువుల ఐక్యంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భగా హిందూ ఏక్తా యాత్రను జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ యాత్రను
కరీంనగర్ కల్చరల్/భగత్‌నగర్, మే 12 (ఆంధ్రజ్యోతి): హిందువుల ఐక్యంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భగా హిందూ ఏక్తా యాత్రను జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ యాత్రను వైశ్యా భవన్ వద్ద హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతితో కలిసి జెండా ఊపి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులను ఐక్యంగా ముందుకు తీసుకు వెళ్లేందుకే 6 సంవత్సరాలుగా ఏక్తాయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో కులాల వారీగా హిందూవులను విభజించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. దేశంలో రానురాను హిందువులే మైనార్టీలుగా మారే ప్రమాదముందన్నారు. శ్రీరామచంద్రుడికే కష్టాలు తప్పలేదని, ఆ శ్రీరామ చంద్రుడే తనకు ఆదర్శమన్నారు. రాక్షాసులు ఆంజనేయ స్వామికి నిప్పంటిస్తే లంక దహనమైందని, తాను హనుమంతుడి భక్తుడినని, తన కుటుంబానికి నిప్పంటించారని, ఆ నిప్పుతో అవినీతి, కుట్రలు చేసే సామ్రాజ్యాన్ని దహన చేస్తానన్నారు. తన కుటుంబాన్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బండి సంజయ్ ఏనాడు భయపడడని తేల్చిచెప్పారు. కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నామన్నారు. ఆయినా బాధ పడనని, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పని చేస్తానన్నారు. కరీంనగర్‌లో టవర్ సర్కిల్‌పై కాషాయ జెండా ఎగురవేశామన్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అని హంపి పిఠాధిపతి విద్యారణ్య భారతి అన్నారు. హిందువులంతా బండి సంజయ్‌కుమార్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
ఫ కదిలిన కాషాయ దండు
కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రను పురస్కరించకుని కాషాయ దండు కదిలి వెళ్లింది. భారీ హనుమాన్, రాముడు, భరతమాత విగ్రహాలు, పలు కళారూపాలు మధ్య భక్తిశ్రద్ధలతో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. యాత్ర రాజీవ్‌చౌక్, టవర్‌సర్కిల్, గంజ్, కమాన్ చౌరస్తా, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, వేంకటేశ్వర స్వామి ఆలయం, జయశంకర్ సర్కిల్ సర్కిల్ నుంచి రాజీవ్ చౌక్ మీదుగా వైశ్యభవన్ వరకు యాత్ర కొనసాగింది.