kumaram bheem asifabad- భూసార పరీక్షతో అధిక దిగుబడి
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:24 PM
వ్యవసాయ భూములు ఏ రకమైన పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. భూమిలోని పోషకాల స్థాయి, ఎరువుల వాడకం ఏ సందర్భాల్లో ఉపయో గించాలనే విషయాలపై రైతులకు అవగాహన కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, ప్రకృతీ వైపరీత్యాలు తోడవడంతో అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్ష లు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆశించిన దిగుబ డులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు
- వినియోగించుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు
- జిల్లాలో 70 క్లస్టర్లు, 4.6 లక్షల ఎకరాల్లో సాగు
చింతలమానేపల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూములు ఏ రకమైన పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. భూమిలోని పోషకాల స్థాయి, ఎరువుల వాడకం ఏ సందర్భాల్లో ఉపయో గించాలనే విషయాలపై రైతులకు అవగాహన కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, ప్రకృతీ వైపరీత్యాలు తోడవడంతో అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్ష లు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆశించిన దిగుబ డులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు ఈ పరీక్షలు చేయించడం లేదు. మరి కొంత మంది రైతులు ప్రైవేటుగా భూసార పరీక్షలు చేయించుకుం టున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ఈ విషయంలో అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారన్న అరోపణలున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం భూసార సంరక్షణకు జిల్లాలో 1,032 మందిని వలంటీర్లుగా నియమించి రైతుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులకు మేలు జరుగనుంది.
- జిల్లాలో ఇలా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 70 క్లస్టర్లు ఉండగా, 4.6లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 1.5లక్షల మంది రైతులు ఉన్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో పత్తి, వరి, సోయా, మిరప, పెసరా, మినుము, జొన్న, మొక్కజొన్న, శెనగ, కంది, తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి. భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలి యక పోవ డంతో సాగులో పెట్టుబడి పెరిగి ఆశించిన దిగుబడి రాని పరిస్థితి. ఫలితంగా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు.
- అవగాహన లేమితో..
రైతులు పంటల సాగులో విరివిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో సాగు వ్యవసాయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయశాఖ పదేపదే చెప్తున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరోవైపు భూసార పరీక్షల ఫలి తాలను సైతం అధికారులు సమయానికి అందించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
- ఫలితాల ఆధారంగా..
భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితా లను అనుసరించి పంటల సాగు, అధిక దిగుబడి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్‌ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అవసమైన మోతాదులో ఎరువులు వినియోగించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రా లను ఆశ్రయించి వారు సూచించిన వంగడాలను ఉపయో గిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది. కాగా భూసార పరీక్షల పట్ల అవగాహన ఉన్న కొందరు రైతులు వ్యవసాయ అధికారులు పరీ క్షలు చేసేందుకు కాలయాపన చేస్తే ప్రైవేటుగానే కొందరు భూసార పరీక్షలు చేయించుకుం టున్నారు. దీని ద్వారా వారికి ఆర్థికంగా కొంత మేర భారం పడుతుంది. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచి భూసార పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులు సైతం భూసార పరీక్షల పట్ల రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో అవగాహన కల్పించాలి..
- వెంకటేష్, రైతు
భూసార పరీక్షల వల్ల కలిగే లాభాల పట్ల రైతు లకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలి. భూసార పరీక్షలతో రైతులకు మేలు జరుగుతుంది. దీని ద్వారా రైతులు ఏ పంటలు వేసుకోవాలో అవగాహన కలుగుతుంది.