Share News

అధిక సాంద్రతతో సం’పత్తి’

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:34 PM

పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. తక్కువ విస్తీర్ణం లో ఎక్కువ దిగుబడి సాధించేలా అధిక సాంద్రతతో పత్తి సాగు విధానం రైతులకు అందుబాటలోకి వచ్చిం ది. కొత్త పద్ధతిలో పత్తి సాగు చేస్తే దిగుబడి, ఆదా యం రెండింతలు పెరుగుతుందని నిఫుణులు అంటు న్నారు.

అధిక సాంద్రతతో సం’పత్తి’

-తక్కువ విస్తీర్ణం.. ఎక్కువ దిగుబడి

-పత్తి సాగులో నూతన విధానానికి శ్రీకారం

-తొందరగా పూత, కాత... ఒకేసారి సేకరణ

- జిల్లాలో 4120 ఎకరాల్లో సాగు...

-ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా విత్తనాలు

నెన్నెల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. తక్కువ విస్తీర్ణం లో ఎక్కువ దిగుబడి సాధించేలా అధిక సాంద్రతతో పత్తి సాగు విధానం రైతులకు అందుబాటలోకి వచ్చిం ది. కొత్త పద్ధతిలో పత్తి సాగు చేస్తే దిగుబడి, ఆదా యం రెండింతలు పెరుగుతుందని నిఫుణులు అంటు న్నారు. ఇందులో సంప్రదాయ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల సంఖ్యను పెంచుతారు. ఈ విధానంతో త క్కువలో తక్కువగా 30 నుంచి 40 శాతం దిగుబడి పెరుగుతుందని.. గరిష్ఠంగా 50 శాతం దాకా అధిక ది గుబడి ఉంటుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ నల్లా మహేష్‌రెడ్డి తెలిపారు. మూడేళ్లుగా కొందరు ఔ త్సాహిక రైతులతో ఈ విధానంలో సాగు చేయించి స త్ఫలితాలు సాధించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవ సాయ విశ్వవిద్యాలయం సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రొత్సహిస్తోంది. ఈ సంవత్సరం వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 4120 ఎకరాల్లో సా గు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఉచి తంగా విత్తనాలు అందజేసి ప్రొత్సహిస్తున్నారు.

-ఎకరానికి 25 వేల మొక్కలు..

మొక్కల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా తక్కు వ విస్తీర్ణంలో మొక్కల సంఖ్యను గణనీయంగా పెంచి అధిక దిగుబడిని సాధించవచ్చు. అధిక సాంధ్రత వి ధానంలో పత్తి విత్తనాలను అతి దగ్గెరగా విత్తుతారు. సంప్రదాయ సాగులో ఎకరానికి 7400 వరకు మొక్క లు ఉంటే ఈ సాగులో 25 వేల మొక్కలు ఉంటాయి. సాధారణ సాగులో ఒక్క మొక్కకు 30 కాయలు కాసి నా పత్తి కాయల సంఖ్య 2.22 లక్షలు అవుతుంది. అదే 25 వేల మొక్కలకు ఒక్కో మొక్కకు 20 కాయలు కా సినా పత్తి కాయల సంఖ్య 5 లక్షలు అవుతుంది. మొ క్కల సంఖ్య మూడింతలకు పైగా పెరుగుతుంది. మొ త్తంగా 50 శాతం ఎక్కువ దిగుబడి వస్తుంది.

-పత్తి ఏరడం ఒకేసారి..

సాధారణ పత్తిసాగుతో పోల్చితే ఈ విధానం కొంత భిన్నంగా ఉంటుంది. విత్తనాలు ఎక్కువ వేయడం, పంట కాలం తక్కువ ఉండటం, ఒకే సారి చేతికి వ స్తుంది. సాధారణంగా పత్తిని మూడు సార్లు సేకరి స్తారు. కాని ఈ నూతన విధానంలో ఒకే సారి పంట మొత్తం చేతికి వస్తుంది. ఒకే సారి చేతికే వచ్చేలా చే సేందుకు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించా ల్సి ఉంటుంది. మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా నియంత్రిస్తారు. ఇంతుకోసం కొత్తగా మెపిక్వాట్‌ క్లోరైడ్‌ రసాయనాన్ని పంటకు పిచికారి చేస్తారు. ఇది 40 నుంచి 60 రోజుల్లో ఒకసారి, 70-80 రోజుల్లో మ రోసారి స్ర్పే చేస్తారు. ఈ ద్రావణం మొక్క పెరుగుత లను నియంత్రించి ఒకేసారి పూత, కాత వచ్చేలా చే స్తుంది. దీంతో రెండు మూడు సార్లు కాకుండా ఒకేసారి పత్తి ఏరుకోవచ్చు.

-యంత్రం ఉపయోగిస్తే మేలు..

కూలీల కంటే యంత్రంతో విత్తితే లెక్కప్రకారం తక్కువ ఎక్కువ కాకుండా మొక్కలను నాటుకోవచ్చు. యంత్రంతో సమయం, డబ్బులు ఆదా అవుతాయి. ప త్తి విత్తులు విత్తేందుకు ట్రాక్టర్‌తో నడిచే యంత్రాలు అద్దెపై అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో కేవలం 45 నిమిషాల్లో ఎకరానికి 25 వేలకు పైగా విత్తనాలు నాటవచ్చు. ఇందు కోసం రైతు యంత్రం అద్దె గా రూ. 1500లు చెల్లిస్తే సరిపోతుంది. అదే సాదారణ పద్దతిలో ఐదారు మంది కూలీలు రోజంతా పనిచేస్తే ఎకరం విస్తీర్ణంలో 7500ల విత్తనాలు విత్తుతున్నారు. వారికి కూలీ కిందా రూ.2500ల నుంచి 3వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. యంత్రంతో సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. యంత్రంతో విత్తే పద్ధతిపై కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

-నూతన పద్ధతిలో 4210 ఎకరాల్లో సాగు

సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో 4120 ఎకరాల్లో అధిక సాంద్రత విధానం లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. లాభదా యకంగా ఉండటంతో ఈ నూతన పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామాల వారిగా ఔత్సాహిక రైతుల ను గుర్తిస్తున్నాం. ఈ విధానంలో విత్తనాలు ఎక్కువ అవసరం కావడంతో విత్తన ఖర్చు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసిన రైతులకు ఉచి తంగా విత్తనాలను ప్రభుత్వం అందజేస్తోంది. విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు వ్యవసా య అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తారు.

రెండింతల దిగుబడి వస్తుంది

నల్లా మహేష్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, కేవీకే బెల్లంపల్లి

కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలో మూడే ళ్లుగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయిం చాం. వివిధ గ్రామాల్లో 420 ఎకరాల్లో సాగు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఎకరానికి సాధారణ సాగులో 7500 మొక్కలు ఉంటే నూతన విధానంలో 25 వేల మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎకరానికి ఐదు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం. పంటను ఎక్కు వ ఎత్తు పెరగకుండా రసాయణాలతో నియంత్రించు కోవాలి. ఒకే సారి పత్తి ఏరడంతో కూలీల కొరతను అధిగమించవచ్చు. ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంట కాలం తగ్గడంతో ఆఖరు దశలో సోకే గులాబీ రంగు పురుగు రాదు. పత్తి పంట ను తొలగించి మరోపంటను సాగు చేసుకోవచ్చు.

Updated Date - Jun 27 , 2026 | 11:34 PM