Share News

హైటెన్షన్‌..

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:02 AM

క్యాతన్‌ పల్లి మునిసిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్ర క్రియ మంగళవారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాం గ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఆందోళనలు నెలకొ నగా ఒక వర్గం మరో వర్గం భౌతిక దాడులకు పూను కున్నారు.

హైటెన్షన్‌..

ఉద్రిక్తంగా మారిన క్యాతన్‌పల్లి చైర్మన్‌ ఎన్నిక...

రెండో రోజూ వాయిదా

మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్‌ నాయకుల దాడి

ట్రాఫిక్‌ కోన్‌ను మంత్రి వాహనంపైకి విసిరిన బాల్క సుమన్‌

ఇరు పార్టీల కార్యకర్తల ఆందోళనలు

స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు

మంచిర్యాల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): క్యాతన్‌ పల్లి మునిసిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్ర క్రియ మంగళవారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాం గ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఆందోళనలు నెలకొ నగా ఒక వర్గం మరో వర్గం భౌతిక దాడులకు పూను కున్నారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు లాఠీచార్జి చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. మునిసి పాలిటీలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా చై ర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక రెండో రోజు కూడా వాయి దా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మునిసిపల్‌ ఎన్నికల్లో మిత్ర పక్షాలైన బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులు ఉదయం 10 గంటల సమయంలో తమ సభ్యులను ప్రమాణ స్వీకారం కోసం మునిసిపల్‌ కార్యాలయానికి తరలించేందుకు మాజీ ఎమ్మెల్యే బా ల్క సుమన్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా, స్థానిక ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సభ్యుల వెంట కేవలం ఐదాగురు మాత్రమే వెళ్లాలని, పోలీసు లు సూచించడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బాఠాయించి ఆందోళనకు పూనుకున్నారు. కొద్ది సేపటి తరువాత అదే మార్గంలో మంత్రి గడ్డం వివేకానంద కాన్వాయ్‌ కూడా రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోపోద్రిక్తులైన బీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకొని రాళ్లదాడికి దిగారు. ఈ క్రమంలో ఓ ట్రాఫిక్‌ కోన్‌ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మంత్రి వివేక్‌ వాహనంపైకి విసిరారు. ఈ దాడిలో మంత్రి వాహనం అద్దాలు స్వల్పంగా ధ్వంసం కాగా, రాకేష్‌ అనే కానిస్టేబుల్‌తోపాటు కాంగ్రెస్‌ కార్యక ర్తలు జావీద్‌ఖాన్‌, బొద్దున ప్రేంసాగర్‌కు తీవ్ర గాయా లయ్యాయి. దీంతో మంత్రి కాన్వాయ్‌లో ఉన్న కార్యక ర్తలు కూడా పరుగున రావడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. లాఠీ చార్జీలో గోగుల రవీంధర్‌రెడ్డి అనే బీఆర్‌ఎస్‌ నాయకునికి కూ డా చేతులపై గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాల్క సుమన్‌ను పోలీసులు స్థానికంగా ఉన్న ఆయన నివాసానికి బలవంతంగా తరలించి, బ యటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం మంత్రి తోపాటు ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎక్స్‌ అఫీషియో సభ్యుల హోదాలో ఓటు వేసేందుకు మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. త రువాత బీఆర్‌ఎస్‌ నాయకుల దాడిని నిరసిస్తూ కాం గ్రెస్‌ వర్గం వారు కూడా రోడ్డుపై బాఠాయించి ఆందోళ నకు దిగారు. పోలీసులు వారిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.

పోలీసుల వైఫల్యం కారణంగానే...!

క్యాతన్‌పల్లి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద బీఆర్‌ఎస్‌ నాయ కులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిని వారిం చేందుకు యత్నించిన పోలీసులు అదే సమయంలో మంత్రి వివేక్‌ కాన్వాయ్‌ని ఎలా అనుమతించారన్న ప్ర శ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మంత్రి కాన్వాయ్‌ వ స్తుందన్న విషయం (5వ పేజీ తరువాయి)

పోలీసులకు ముందుగానే సమాచారం ఉంటుంది. అయినా దా రి మళ్లించకుండా నేరుగా బీఆర్‌ఎస్‌ ఆందోళన చేపట్టి సంఘ టన వద్దకు అనుమతించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. కేవలం పోలీసుల వైఫల్యం కారణంగానే పరిస్థితులు ఉద్రిక్తంగా మారి, లాఠీ చార్జి జరిగి పలువురు గాయపడే వరకు వచ్చాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఫవాయిదా పడ్డ చైర్మన్‌ ఎన్నిక....

ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వ హించేందుకు అధికారులు సిద్దపడుతుండగా, ఇరు వర్గాల సభ్యు ల మధ్య వివాదం చేలరేగింది. మంత్రి, ఎంపీ ఎదుటే హాలులో ఒ కరిపైకి ఒకరు కుర్చీలు విసురుకోవడంతో కొంత సేపు ఉద్రిక్త వా తారణం నెలకొంది. కొద్ది సేపటి తరువాత కాంగ్రెస్‌ సభ్యులు ఎనిమిది మందిని వెంటబెట్టుకొని మంత్రి, ఎంపీ ఇరువురూ కార్యా లయం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు నె లకొన్న నేపథ్యంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేమని, ఆ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి, మం దమర్రి తహసీల్దార్‌ సతీష్‌ ప్రకటించారు.

మీడియాను అనుమతించని అధికారులు...

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతించేలా ఎ న్నికల కమిషన్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉ న్నాయి. ఎన్నికల పాస్‌లు కలిగి ఉన్న మీడియా ప్రతినిధులను ఎన్నిక హాలులోకి అనుమతించడంతోపాటు వారి కోసం ప్రత్యే కంగా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్న సూచ నలు కూడా సర్క్యులర్‌లో ఉన్నాయి. అయిన ప్పటికీ ప్రత్యేక అధికారి ఆదేశాలతో పోలీసులు మీడియాను లోని కి అనుమతించలేదు. దీంతో జర్నలిస్టులు అధికా రుల వైఖరి పట్ల ఆ గ్రహం వ్యక్తం చేశారు.

న్యాయం కోసం డిమాండ్‌...

ఎన్నికల హాలు నుంచి కాంగ్రెస్‌ సభ్యులు బయటకు వెళ్లిపో యిన తరువాత తమకు న్యాయం జరిపించాలని బీఆర్‌ఎస్‌, సీపీఐ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హాలులో నుంచి బయటకు రాకుండానే అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తూ, న్యాయం కోసం డిమాండ్‌ చేశారు. అసలు లోపల సభ్యుల మధ్య వివాదమే చో టు చేసుకోలేదని, కాంగ్రెస్‌కు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కే పరిస్థితి లేకపోవడంతోనే డ్రామా ఆడుతున్నారని వారు తెలిపారు.

పోలీసు పహారా మధ్య కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

రామకృష్ణాపూర్‌: పోలీసు పహారా మధ్య మంగళవారం బీఆర్‌ ఎస్‌, సీపీఐ, కాంగ్రెస్‌ వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కొనసా గింది. మంత్రి వివేక్‌, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ ఓటు హ క్కును వినియోగించుకునేందుకు రావడంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తరువాత మంత్రి వివేక్‌ తమను ప్రలోభాలకు గురి చేశాడంటూ బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులు కార్యాలయంలో నిరస న తెలిపారు. అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన అధి కారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ నియామకం జరుగుతున్న క్రమంలో మంత్రి, ఎంపీ, గెలిచిన కాంగ్రెస్‌ వార్డు కౌన్సిలర్లను కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. పూర్తి స్థాయి కోరం సభ్యులు ఉన్నా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ప్రమాణస్వీకారం విషయంలో అధికా రులు పూర్తిగా మంత్రి కనుసన్నల్లో పని చేయడం వల్లనే ప్రమాణ స్వీకార ప్రక్రియ ముందుకు జరుగడం లేదని కార్యాలయం లోపల అ భ్యర్థులు ఆందోళనలు చేపట్టారు.

‘మాతో అసభ్యకరంగా ప్రవర్తించారు’...

మున్సిపల్‌ ఎన్నికల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ నాయకులు తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్‌, వార్డు కౌన్సిలర్లు మీడియా ముందు వాపోయారు. ప్ర మాణ స్వీకారం సజావుగా సాగుతున్న క్రమంలో సమావేశం లో పలున్న పోలీసు అధికారులను బయటకు పంపి మంత్రి వివేక్‌, ఎంపీ వంశీ, సమావేశ ప్రత్యేకాధికారి ఎన్నికల నియామవళిని ఉల్లంఘించి తమను ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నించారన్నా రు. 8వ వార్డుకు చెందిన సీపీఐ అభ్యర్థి మునిపై గుర్రం శ్రీనివాస్‌ అనే కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బంధించే ప్రయత్నాలు చేయడంతో అతడి కి రక్షణ కల్పించేందుకు వెళ్లిన మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా మంత్రి, ఎంపీ చూస్తూ ఉండిపోయారన్నారు. ఇదిలా ఉం డగా కౌన్సిల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లపై ఎలాంటి అసభ్య ప్రవర్థన జరగలేదని మహిళా కౌన్సిలర్లు తెలిపారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. సుమన్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:02 AM