Share News

బాలికల పాఠశాలకు భవనాలు ఇవ్వరా?

ABN , Publish Date - May 30 , 2026 | 04:35 AM

శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల (సీతాఫల్‌మండి విజయడెయిరీ స్కూల్‌)కు విజయ డెయురీకి...

బాలికల పాఠశాలకు భవనాలు ఇవ్వరా?

  1. సానుకూల నిర్ణయం తీసుకోకపోతే సీఎస్‌ను పిలుస్తాం: హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల (సీతాఫల్‌మండి విజయడెయిరీ స్కూల్‌)కు విజయ డెయురీకి చెందిన రెండు క్వార్టర్స్‌ కేటాయించడంలో ఇబ్బంది ఏమిటని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తార్నాకలోని డెయిరీకి చెందిన క్వార్టర్స్‌ కేటాయించాలని తల్లిదండ్రులు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ సుద్దాల చలపతిరావు ధర్మాసనం... నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే సీఎ్‌సను పిలుస్తామని హెచ్చరిస్తూ విచారణను జూన్‌ 6కు వాయుదా వేసింది.

Updated Date - May 30 , 2026 | 04:35 AM