Share News

మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:50 AM

మధ్యవర్తిత్వం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, కాజా శరత్‌ పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం

  • హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, శరత్‌

  • ఖమ్మంలో మీడియేషన్‌ శిక్షణ కార్యక్రమానికి ప్రారంభం

ఖమ్మం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మధ్యవర్తిత్వం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, కాజా శరత్‌ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్‌లో న్యాయవాదులకు నిర్వహించిన మీడియేషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సూరేపల్లి నందా మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మీడియేషన్‌ యాక్ట్‌ ద్వారా ఈ ప్రక్రియకు చట్టబద్ధత కల్పించారని, న్యాయవాదులకు మీడియేషన్‌పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 40 గంటల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. మీడియేషన్‌ అంగీకారంలో ఏ ఒక్కరినీ బెదిరించకూడదని కాజా శరత్‌ అన్నారు. రాష్ట్రంలో పది శాతం కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. మీడియేషన్‌ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న 600మంది న్యాయవాదులకు శిక్షణ అందించామమని తెలంగాణ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ స్టేట్‌ సెక్రటరీ పంచాక్షరి తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 04:51 AM