Share News

High Court: వేములవాడ ‘తలనీలాల టెండర్‌’ వివాదానికి తెర

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:40 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర ముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి ‘తలనీలాల సేకరణ టెండర్‌’ వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది.

High Court: వేములవాడ ‘తలనీలాల టెండర్‌’ వివాదానికి తెర

  • టెండర్‌ రద్దు కోరుతూ వేసిన పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర ముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి ‘తలనీలాల సేకరణ టెండర్‌’ వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది. టెండర్‌ ప్రక్రియలో పాల్గొనని సంస్థకు, ఆ టెండర్‌ను సవాల్‌ చేసే హక్కు లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో రాజన్న ఆలయ తలనీలాల సేకరణ కోసం దేవాదాయశాఖ ఈ-టెండర్‌ నిర్వహించింది. ఈ ప్రక్రియలో అత్యధిక బిడ్‌ వేసిన ‘కాలావాటి ఎంటర్‌ప్రైజెస్‌’ అనే కంపెనీ కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే తమకు అనుభవం ఉన్నా టెండర్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ ‘దురాయ్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ కోర్టును ఆశ్రయించింది. కాలావాటి ఎంటర్‌ప్రైజె్‌సకు ఇచ్చిన టెండర్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ కేసును విచారణ చేసిన జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం.. మరొకరికి కేటాయించిన టెండర్‌ను సవాల్‌ చేసే హక్కు పిటిషనర్‌ కంపెనీకి లేదని తేల్చి చెప్పింది.

Updated Date - Jan 15 , 2026 | 06:40 AM