బొల్లా బ్రహ్మనాయుడుకు దక్కని ఊరట
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:39 AM
నకిలీ జీవోలు, దొంగ పత్రాల ఆధారంగా గండిపేటలో రూ.1500 కోట్లు విలువైన భూమిని కబ్జా చేయాలని చూసిన కేసులో నిందితుడు...
ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): నకిలీ జీవోలు, దొంగ పత్రాల ఆధారంగా గండిపేటలో రూ.1500 కోట్లు విలువైన భూమిని కబ్జా చేయాలని చూసిన కేసులో నిందితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు గురువారం తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరుకు అంగీకరించలేదు. ఆయన తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌తోపాటు, తుది తీర్పు వచ్చే వరకు రక్షణ కల్పించేలా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ఇందుకు నిరాకరించిన హైకోర్టు.. వివరాలు తెలియజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేస్తూ తదుపరి విచారణను 11కు వాయిదా వేసింది.