kumaram bheem asifabad- సర్టిఫికెట్లు పోతే ఇలా పొందొచ్చు
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:57 PM
అనుకోని విధంగా విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పోతే ఇలా చేయడం వల్ల పొందే అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగ జీవి తానికి పది, ఇంటర్మీడియట్ ధ్రువపత్రాలు ఎంతో ముఖ్యం. అనుకోని విధంగా వీటిని పోగొట్టుకుంటే నకలు మళ్లీ నొందేందుకు మార్గాలు ఉన్నాయి. ఇందుకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
బెజ్జూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అనుకోని విధంగా విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పోతే ఇలా చేయడం వల్ల పొందే అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగ జీవి తానికి పది, ఇంటర్మీడియట్ ధ్రువపత్రాలు ఎంతో ముఖ్యం. అనుకోని విధంగా వీటిని పోగొట్టుకుంటే నకలు మళ్లీ నొందేందుకు మార్గాలు ఉన్నాయి. ఇందుకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు ఇలా..
- పదో తరగతి బీఎస్‌ఈ.ఏపి జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో వెళ్లి డూప్లికేట్ ఎస్‌ఎస్‌సీ దరఖా స్తు ఐచ్చికంపై క్లిక్ చేస్తే తెరుచుకుంటుంది. ప్రింట్ తీసి వివరాలు నింపాల్సి ఉంటుంది.
- దరఖాస్తుపై ఫొటో అతికించి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన లేఖ, రూ.50విలువైన స్టాంప్ పేపరుపై చేయించిన అఫిడవిట్, సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అంతకంటే ఎక్కువ స్థాయి కలిగిన అధికారి ఎవరైనా ఇచ్చిన నాట్‌ట్రేసింగ్ ద్రువపత్రం, పోగొట్టుకున్న పదో తరగతి ద్రువపత్రం జిరాక్స్‌లను జత చేయాలి.
- రూ.250విలువైన చలానా తీసి, ఇవన్నీ కలిపి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారికి పోస్టులో పంపాలి.
- నెల రోజుల్లో ఆ పాఠశాలకు నకలు ధ్రువపత్రం వస్తుంది. విద్యార్థి ఫొటోతో పాఠశాలకు వెళ్తే ధ్రువపత్రం పై అతికించి ప్రధానోపాధ్యాయుడు సంతకం పెట్టి ఇస్తాడు.
- ఇంటర్మీడియట్ బీఐసీఏపి.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ సర్వీసెస్‌లోకి వెళ్లి డూప్లికేట్ ఓపెన్ చేయాలి.(మొదటిసారి పోతే డూప్లికేట్, రెండోసారి అయి తే ట్రిప్లికేట్)అందులో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ నమోదు చేస్తే విద్యార్థి వివరాలు కనిపిస్తాయి.
- అన్ని పరిశీలించి ఫోన్ నంబరు నమోదు చేశాక సర్టిఫికెట్ పోయిందా, చిరిగి పోయిందా ఎంచుకోవాలి. పోయిటన్లయితే పోలీస్ ఎఫ్‌ఐఆర్ కాపీ, చిరిగితే చిరిగిన కాపీ అప్‌లోడ్ చేయాలి.
- ఆ తర్వాత అఫిడవిట్, ప్రిన్సిపల్ సంతకం చేసిన దరఖాస్తు ఫారాన్ని నింపి అప్‌లోడ్ చేయాలి. సర్టిఫికెట్ పొందాల్సిన అవసరాన్ని కూడా పొందుపర్చాలి. తర్వాత చలానా తీసి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేస్తే అప్లికేషన్ నంబరు వస్తుంది.
- ఆ నంబరు ద్వారా దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. అప్‌లోడ్ చేసిన ఒకసెట్ పత్రాలను సంబంధిత కళాశా లకు ఇవ్వాలి. అనంతరం నకలు కళాశాలకు వస్తుంది.