Share News

kumaram bheem asifabad- మొబైల్‌తో గ్యాస్‌ ఈ-కేవైసీ చేసుకోండిలా..

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:46 PM

గ్యాస్‌ ఈ-కేవైసీని మొబైల్‌తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులు బాటు ఉంది. ఎల్‌పీజీ వంట గ్యాస్‌ వినియోగంలో అక్రమాలకు చెక్‌ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశపెట్టారు. ఇన్నేళ్లు గడిచినా.. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. వినియోగదారులు ఆగస్టు 16 లోపు పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

kumaram bheem asifabad- మొబైల్‌తో గ్యాస్‌ ఈ-కేవైసీ చేసుకోండిలా..
లోగో

వాంకిడి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ ఈ-కేవైసీని మొబైల్‌తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులు బాటు ఉంది. ఎల్‌పీజీ వంట గ్యాస్‌ వినియోగంలో అక్రమాలకు చెక్‌ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశపెట్టారు. ఇన్నేళ్లు గడిచినా.. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. వినియోగదారులు ఆగస్టు 16 లోపు పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి వద్దనే ఫోన్‌లో యాప్‌ ద్వారా చేసుకునే వెసులుబాటును ఏజెన్సీలు కల్పించాయి. కనెక్షన్లను ఆధార్‌తో అనసఽంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలి ముద్రలు, ఐరిస్‌ వంటి మూడు విధానాలతో ఎల్‌పీ వినియోగదారులు ఈ- కేవైసీని పూర్తి చేయవచ్చు.

ఫ హెచ్‌పీ..

ప్లే స్టోర్‌ నుంచి హెచ్‌పీ పే తో పాటు ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేశాక రిజిస్టర్‌పై క్లిక్‌ చేసి మీ గ్యాస్‌ అకౌంట్‌కు లింకైన మొబైల్‌ నంబరు ఎంటర్‌ చేసి ఓటీపీ వెరిఫై చేసి లాగిన్‌ అవ్వాలి. అనంతరం హోమ్‌ పేజీలో మై హెచ్‌పీ సెక్షన్‌కు వెల్లి ఎల్‌పీజీ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి. అప్పుడు మీకు ఈ-కేవైసీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి స్ర్కీన్‌పై కనిపించే సూచనలు పాటించాలి. అనంతరం కాప్చర్‌ ఫేస్‌పై క్లిక్‌ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. తర్వాత ముఖాన్ని స్కాన్‌ చేస్తే పూర్తవుతుంది.

ఫ భారత్‌..

ప్లేస్టోర్‌ నఉంచి హెలో బీపీసీఎల్‌ ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌ లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేశాక రిజిస్టర్‌ మొబైన్‌ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్‌ పూర్తి చేసి లాగిన్‌ అవ్వాలి. యాప్‌ హోమ్‌ పేజీలోనే ఈ-కేవైసీ ఆప్షన్‌ కలిపిస్తుంది. క్లిక్‌ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అనంతరం ప్రొసెస్‌కు సూచనలు చేస్తుంది. దాన్ని పాటిస్తూ పూర్తి చేసుకోవాలి.

ఫ ఇండెన్‌..

ప్లేస్టోర్‌ నుంచి అండియన్‌ ఆయిల్‌ వన్‌ ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేసి లింక్‌ అయిన ఫోన్‌ నంబరు లేదా మేయిల్‌తో పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. మీరు మొదటిసారి ఉపయోగిస్తే సైన్‌ ఆఫ్‌ పై క్లిక్‌ చేసి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలి. మీ గ్యాస్‌ క్యాస్‌ మెమోలేదా సబ్‌ స్ర్కిప్షన్‌ బోచర్‌పై ఉండే 16 అంకెల ఎల్‌పీజీ ఐడీని లింక్‌ చేయాలి. అప్పుడు మీ కస్టమర్‌ వివరాలు కనిపిస్తాయి. లాగిన్‌ అయ్యాక హోమ్‌ పేజీలో ప్రొఫైల్‌పై క్లిక్‌ చేస్తే ఆధార్‌ లింక్‌డ్‌ అండ్‌ ఈ-కేవైసీ స్టెటస్‌ కనిపిస్తుంది. అక్కడ గ్రీన్‌ కలర్‌లో రెడ్‌ మార్క్‌ ఉంటే మీ కేవైసీ పూర్తయినట్లు. కాకపోతే అక్కడే రీ అథంటికేట్‌ బటన్‌ నొక్కిమీ ముఖాన్నిస్కాన్‌ చేసి బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. ఒక వేళ మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ అయి ఉంటే మొదటగా దాన్ని అన్‌లాక్‌ చేయాలి.

జాగ్రత్తలు పాటించాలి..

నాయబ్‌ తహసీల్దార్‌. రాంలాల్‌

వినియోగదారులు ఈ-కేవైసీ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. నకిలీ వెబ్‌ సైట్‌లు, సైబర్‌ నేరగాళ్ల బారిన పడే అవకాశాలున్నాయి, అధీకృత కంపెనీల వెబ్‌సైట్లు మాత్రమే ధ్రువీకరించుకొని ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.

Updated Date - Aug 14 , 2026 | 11:46 PM