kumaram bheem asifabad- అధిక భారం.. అడుగడుగునా ఛిద్రం
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:27 PM
అధిక లోడ్‌తో కంకర, ఇసుక, మొరం తరలిస్తున్న లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లు దెబ్బతింటున్నా యి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సిర్పూర్(టి) మండలంలోని వెంకట్రావ్‌పేట్ మీదుగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతా లకు భారీ లారీలు వరుస కడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ నిత్యం సుమారు 100-150 లారీల వరకు సిర్పూర్(టి) నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక లోడు వాహనాలతో రోడ్లు ధ్వంసమైపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.
- దుమ్ముతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని అధికారులు
సిర్పూర్(టి), ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): అధిక లోడ్‌తో కంకర, ఇసుక, మొరం తరలిస్తున్న లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లు దెబ్బతింటున్నా యి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సిర్పూర్(టి) మండలంలోని వెంకట్రావ్‌పేట్ మీదుగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతా లకు భారీ లారీలు వరుస కడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ నిత్యం సుమారు 100-150 లారీల వరకు సిర్పూర్(టి) నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక లోడు వాహనాలతో రోడ్లు ధ్వంసమైపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేం దుకే అక్రమార్కులు ఇతర మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. లారీల్లో సరుకు రవాణా చేయాలంటే బరువుకు తగ్గ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అధిక బరువు వాహనాలకు ప్రత్యేక అనుమ తులు అవసరం. అంతే కాకుండా ప్రధాన రోడ్ల వెంబడి వెళ్తే టోల్‌గేట్లు, రోడ్ల నష్షం పరిహారం, ఇతర పన్నులు కూడా చెల్లించాల్సి ఉంది. టోలుగేట్లను తప్పించుకు నేలా అడ్డుదారుల్లో రాకపోకలు సాగించడం చట్టవిరుద్ధం. కానీ ఇవన్నీ తప్పించుకునేందుకే ఇలా అడ్డదారుల్లో రవాణా జరుగుతోందని మండల ప్రజలు చెబుతున్నారు. రవాణాశాఖ, సేల్ టాక్స్ అధికారుల కళ్లుగప్పి ఇలా ఈ మార్గాల మీదుగా ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన వెంకట్రావ్‌పేట్, మాకుడి వద్ద ఆదాయ పన్ను శాఖ, రవాణా శాఖ చెక్ పోస్టులు ఏర్పా టు చేస్తే అక్రమాలను అడ్డుకోవచ్చని ప్రజలు చెబుతు న్నారు. డివిజన్ పరిధిలో వే బ్రిడ్జిలు లేక పోవడం, అధికారులు తనిఖీలు జరపక పోవడం, ముఖ్యంగా రాత్రి వేళ రవాణా నియంత్రణ లేక పోవడం వంటి కారణాలతో లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా సిర్పూర్ (టి), కౌటాల మండలాల్లో తా త్కాలిక బరువు గేజలు ఏర్పాటు చేయాలని, నిత్యం తనిఖీ లు చేపట్టాలని, స్థానికులు కోరుతున్నారు.
ఈ అనుమతులు ఉండాల్సిదే..
ఫ స్పెషల్ పర్మిట్: సరుకు లోడును తరలించేం దుకు నిర్ధష్ట రూట్, రోడ్ల అనుమతి అవసరం. ఈ మేరకు రవాణా శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.
గ్రాస్ వెహికల్ బరువు పరిమితి..
ఫ జీవీడబ్ల్యూ: వాహనం తయారీ కంపెనీ సూచించిన మొత్తం బరువు పరిమితి కంటే ఎక్కువ బరువుతో ప్రయాణించకూడదు.
ఫ ఫిట్‌నెస్ సర్టిఫికెట్: వాహనం అధిక బరువును భద్రంగా తీసుకెళ్ల గల సామర్థ్యం ఉందని నిరూపించే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పని సరి.
ఫ రోడ్ల నష్ట పరిహారం ఫీజు: అధిక బరువుతో రవాణా చేసే వాహనాలు ప్రత్యేక ఫీజు చెల్లించాలి.
ఫ టోల్ చెల్లింపులు: టోల్‌గేట్ల వద్ద చెల్లింపులు తప్పని సరి. వాహనచక్రాల ఆధారంగా పన్ను ఉంటుంది.
ఫ పోలీసు అనుమతి: అత్యవసర రవాణా లేదా అధిక లోడ్‌తో వెళ్లడానికి పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలి.