ముదురుతున్న ఎండలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:38 AM
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండ తీవ్రత 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరనున్నాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో....
రేపటి నుంచి 40 డిగ్రీల ఎండ.. అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండ తీవ్రత 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరనున్నాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యధికంగా 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.