11 జిల్లాల్లో 41 డిగ్రీల పైనే ఎండ
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:29 AM
రాష్ట్రంలో మార్చి చివరి నాటికే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో గరిష్ట ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8 డిగ్రీలకు చేరింది.
హైదరాబాద్, నార్నూర్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మార్చి చివరి నాటికే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో గరిష్ట ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8 డిగ్రీలకు చేరింది. గతేడాది ఇదే రోజు 41.2 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా.. మరో 13 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కి చెందిన కలవలె విజయ్ (38) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, సర్పంచ్ రాథోడ్ దిలీప్ తెలిపారు.