నేటి నుంచి పెరగనున్న ఎండ తీవ్రత
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:07 AM
నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని..
నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39-41 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.