ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:28 PM
ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డీఎంహెచ్‌వో అనిత, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, ప్రభుత్వ ఆసు పత్రి సంచాలకులు వేదవ్యాస్‌తో కలిసి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డీఎంహెచ్‌వో అనిత, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, ప్రభుత్వ ఆసు పత్రి సంచాలకులు వేదవ్యాస్‌తో కలిసి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు వ్యాక్సిన్ ఇస్తారన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులకు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల ద్వారా, మహిళ సంఘాల ద్వారా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలన్నారు. గర్భాశయ,ముక్కు ద్వారా క్యాన్సర్లు రాకుండా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 8150 మంది పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి,లక్షెట్టిపేట, చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారన్నారు. నస్పూర్‌లోని కస్తూర్బా విద్యాలయం, జిల్లా మైనార్టీ సంక్షేమ బాలికల పాశాలలో 30 మంది విద్యార్థినీలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. అనంతరం కార్యక్రమం గోడ ప్రతులను విడుదలను చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి బాలాజీ, ఆర్‌ఎంవోలు భీష్మ, శ్రీధర్,డీపీవో ప్రశాంతి, ఆర్‌ఎస్ పద్మ, అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు,కార్పోరేటర్లు,వైద్యులు తదితరులు పాల్గొన్నారు.