హెల్త్ స్కీం తక్షణమే అమలు చేయాలి
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:50 PM
ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకై అమలు పరచనున్న ఈ హెచ్‌ఎస్‌ను తక్షణమే వినియోగించు కునేలా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని డి మాండ్ చేసింది.
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్
కందనూలు, జూన్ 21 (ఆంధ్రజ్యో తి) : ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకై అమలు పరచనున్న ఈ హెచ్‌ఎస్‌ను తక్షణమే వినియోగించు కునేలా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని డి మాండ్ చేసింది. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈహెచ్ ఎస్ అమలుకు ముందస్తు సమాచారం లేకుం డా ఉపాధ్యాయులు, ఉద్యోగుల మే నెల వేతనా ల నుంచి ప్రీమియం వసూలు చేశారని, తదు పరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా వైద్య సేవలు పొందడానికి హెల్త్‌కార్డులు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని పేర్కొన్నారు. ప్రభు త్వం తక్షణమే చొరవ తీసుకుని డిజిటల్ కార్డు లను ఈ నెలాఖరులోగా అందించాలని డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్య క్షులు సి.తిరుపతయ్య, ఎం. రమాదేవి, జిల్లా కార్యదర్శులు ఎన్. చంద్రశేఖర్, పి.మహేశ్‌బా బు, ఎన్.నెహ్రుప్రసాద్, ఎం.రాములు తది తరులు పాల్గొన్నారు.