Share News

kumaram bheem asifabad- ఆరోగ్యానికి ముప్పు

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:41 PM

పెళ్లిళ్లు, శుభ కార్యాల సందడి నడుమ విందు భోజనాల్లో విస్త్రతం గా వాడుతున్న ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్లు, గ్లాసులు ఆరోగ్యానికి నిశ్శబ్ధ ముప్పుగా మారుతున్నాయి. కాలంతో పాటు పరుగులు పెడుతున్న ప్రస్తుత పరిస్థి తుల్లో అంతా తాత్కాలికమైంది. పెళ్లిళ్లు, అన్నదానాలు, విహార యాత్రలు, ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వస్తువులే కనిపిస్తున్నాయి.

kumaram bheem asifabad- ఆరోగ్యానికి ముప్పు
అమ్మకానికి సిద్ధంగా ఉన్న పేపర్‌ ప్లేట్లు

- పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులపై ఆందోళన

బెజ్జూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పెళ్లిళ్లు, శుభ కార్యాల సందడి నడుమ విందు భోజనాల్లో విస్త్రతం గా వాడుతున్న ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్లు, గ్లాసులు ఆరోగ్యానికి నిశ్శబ్ధ ముప్పుగా మారుతున్నాయి. కాలంతో పాటు పరుగులు పెడుతున్న ప్రస్తుత పరిస్థి తుల్లో అంతా తాత్కాలికమైంది. పెళ్లిళ్లు, అన్నదానాలు, విహార యాత్రలు, ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వస్తువులే కనిపిస్తున్నాయి. టీ, టిఫిన్‌ నుంచి భోజనం వరకు అన్ని ప్లాస్టిక్‌ వస్తువుల్లోనే తినడం అలవాటు గా మారింది. గతంలో విందు, సహపంక్తి భోజనం, అన్నదానాలు అంటే నేలపై కూర్చోబెట్టి ఆకుతో తయారు చేసిన ఇస్తార్లతో అన్నం వడ్డించేవారు. క్రమక్రమంగా స్టీల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లలో తినే బఫే పద్ధతికి మారింది. అనంతరం ప్లేట్లను శభ్రం చేయ డం ఎందుకని యూజ్‌ అండ్‌ త్రో వాడుతున్నారు. కానీ అదే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.

- ఎక్కడ చూసినా..

ఎక్కడ చూసినా రంగురంగుల్లో ప్లాస్టిక్‌ విస్తరా కులు, గ్లాసులు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో భోజనం చేయడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వేడివేడి టీ కూడా ప్లాస్టిక్‌ కప్‌లోనే తాగుతున్నారు. దీంతో క్యాన్సర్‌ ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పేపర్‌ ప్లేట్ల బెండల్‌ తెరిస్తేనే కెమికల్‌ వాసన వస్తోంది. ఈ పేపర్‌ ప్లేట్ల ను ముందుగా ఫ్యాక్టరీలో ఒక మందంపాటి పేపర్‌పై ఒక సన్నని ప్లాస్టిక్‌ కవర్‌ వేసి పెద్ద పెద్ద షీట్లను తయారు చేస్తారు. పేపర్‌ ప్లేట్ల తయారీదారులు స్టోర్‌ చేసిన షీట్లను ముక్కలుగా కట్‌ చేసుకొని తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ వాటిని ప్లేట్ల యంత్రంలో హీట్‌ చేసి సైడ్‌లను కట్‌ చేస్తారు. వాటి ని బెండల్స్‌గా తయారు చేసి హోల్‌సేల్‌కు, అక్కడి నుంచి రిటైల్‌కు పంపిస్తారు. రిటైలర్స్‌ వద్ద కొన్న ప్లేట్లను నేరుగా భోజనం చేయడానికే ఉపయోగి స్తున్నారు.

- నిపుణులు చెబుతున్నా..

పేపర్‌ ప్లేట్ల వాడకంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయాన్ని వైద్య నిపుణులు పదేపదే చెబుతూ వాటి వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నా ప్రజలు మాత్రం వాటినే యథేచ్చగా వినియోగించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. భోజనం చేసే ముందు 80శాతంకుపైగా శభ్రం చేయకుండానే వినియోగిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మైక్రో ప్లాస్టిక్‌తో తయారైన పేపర్‌ ప్లేట్లలో భోజనం చేస్తే జీర్ణ సమస్యలతో పాటు క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం వాడకాన్ని తగ్గించడం లేదు. ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లు, గ్లాసులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహి స్తున్నా కవర్‌తో తయారు చేసిన పేపర్‌ ప్లేట్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే పుడ్‌ సేప్టీ అధికారులు కూడా వీటిపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి.

Updated Date - Oct 04 , 2026 | 10:41 PM