Share News

అవయవ మార్పిడికి రూ.లక్షల్లో బిల్లులేంటి?

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:29 AM

కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చేయించుకోవాలంటే రూ.లక్షలకొద్దీ భారం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవయవ మార్పిడికి రూ.లక్షల్లో బిల్లులేంటి?

  • ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల తీరుపై వైద్య శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం

  • అన్ని ఆస్పత్రుల్లో చికిత్సల వ్యయంపై నియంత్రణకు శ్రీకారం

  • అవయవదానాన్ని ప్రోత్సహించేలా విధానాల సరళీకృతం

  • తోటా చట్టంపై మంత్రి దామోదర సమీక్ష

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చేయించుకోవాలంటే రూ.లక్షలకొద్దీ భారం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదార రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు ఈ చికిత్సల వ్యయాన్ని భరించగలిగేలా ధరల నియంత్రణ ఉండాల్సిందేనన్నారు. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. తోటా చట్టం (ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ అండ్‌ టిష్యూస్‌ యాక్ట్‌) విధాన రూపకల్పన, వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు వీలుగా క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ చట్టం అమలుపై చర్చించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు వీలుగా విధానాలను సరళీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. దాతల అవయవాలు వృఽథా కాకుండా ఆస్పత్రులు ప్రత్యేక చర్యలను చేపట్టాలన్నారు. మంత్రి సూచనలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఇతర దేశాల నుంచి అవయవ మార్పిడికి వచ్చే రోగుల కోసం నూతన విధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెయ్యి మార్పిడి చికిత్స కోసం 4 ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ అస్పత్రుల్లో చికిత్సలకయ్యే వ్యయంపై నియంత్రణ ఉండేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డా.నరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 05:29 AM