సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:49 AM
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ...
ఆస్పత్రులకు వచ్చే రోగులకు పరీక్షలు చేయండి: దామోదర
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తూ, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల లక్షణాలతో వచ్చే ప్రతి వ్యక్తికి ఆలస్యం లేకుండా పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితి... జిల్లాల వారీ కేసులు, ప్రభుత్వ ఆస్పత్రుల సన్నద్ధత గురించి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు.