సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆరోగ్య భరోసా
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:03 PM
పేద కుటుంబాలు తీవ్ర అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బం దులు పడకుండా సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి
కల్వకుర్తి,ఆగస్టు4 (ఆంధ్రజ్యో తి) : పేద కుటుంబాలు తీవ్ర అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బం దులు పడకుండా సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హైద రాబాద్‌లోని తన నివాసంలో ని యోజకవర్గానికి చెందిన పలువు రు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎ మ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చే యించుకునే పేద కుటుంబాలకు ముఖ్యమం త్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోంద న్నారు. ప్రజలపై వైద్యభారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం తెలం గాణ రాష్ట్రానికి చెందిన సుమారు 20మంది ని రుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితి కల్పించాలని కో రుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్‌రావు, పార్టీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు, లబ్ధిదా రులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.