Share News

ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తె

ABN , Publish Date - May 14 , 2026 | 04:33 AM

ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్ఎస్‌)కు ఎంపికైన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ చల్లా యాదగిరి కుమార్తె చల్లా యామినిని డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు

ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తె

  • అభినందించిన డీజీపీ

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్ఎస్‌)కు ఎంపికైన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ చల్లా యాదగిరి కుమార్తె చల్లా యామినిని డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సీవీ ఆనంద్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యాదగిరి కుమార్తె యామిని ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు ఫలితాల్లో ఆమెకు 119వ ర్యాంకు లభించింది. శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేష్‌ భగవత్‌ ఆమెకు మెంటార్‌గా వ్యవహరించారు.

Updated Date - May 14 , 2026 | 04:33 AM