Share News

వికలాంగుల కోటా టీచర్ల నియామకాలపై వివాదం

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:48 AM

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) నియామకాలకు సంబంధించి వికలాంగుల కోటాలో పరస్పర మార్పిడి (ఇం టర్‌ ఛేంజబిలిటీ) రూల్స్‌ను మార్చడం చెల్లదని పేర్కొంటూ...

వికలాంగుల కోటా టీచర్ల నియామకాలపై వివాదం

  • సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధించిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) నియామకాలకు సంబంధించి వికలాంగుల కోటాలో పరస్పర మార్పిడి (ఇం టర్‌ ఛేంజబిలిటీ) రూల్స్‌ను మార్చడం చెల్లదని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర సస్పెన్షన్‌ విధించింది. గతంలో ఇదే తరహా వివాదంలో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ అయినందున ప్రస్తుత వివాదంలో సైతం మధ్యంతర సస్పెన్షన్‌ విధిస్తున్న ట్లు ఽపేర్కొంది. గతంలో దాఖలైన వ్యాజ్యంతోపాటు ప్రస్తుత పిటిషన్‌ను రోస్టర్‌ ఉన్న డివిజన్‌ బెంచ్‌కు బదిలీచేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.

Updated Date - Mar 18 , 2026 | 04:48 AM