Share News

ఇబ్బందులు లేకుండా గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:14 PM

రాష్ట్రంలో ప్రజల కు ఇబ్బందులు లేకుండా గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇబ్బందులు లేకుండా గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజల కు ఇబ్బందులు లేకుండా గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదనిప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఆయిల్‌ కంపెనీలతో ప్రతి రోజు సమీ క్షించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం ని ర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి రోజు సమీక్షించాలని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో సాగునీటికి, తాగునీటికి సరిపడ నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాకలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు అందుబా టులో ఉన్నాయని, సిలిండర్ల డీలర్లతో సమావేశం నిర్వహించి బుకింగ్‌ నిల్వలపై సమీక్షిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమి టీ సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, సబ్‌కలెక్టర్‌ మనోజ్‌, ఏసీపీ ప్రకాస్‌, అధికారులు విష్ణు ప్రసాద్‌, సురేఖ, శ్రీకళ పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 10:14 PM