Share News

హాషిష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌ ముఠా ఆటకట్టు

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:44 AM

ఏపీలోని తుని నుంచి ముంబైకి గంజాయి నుంచి తీసిన హాషిష్‌ ఆయిల్‌ను తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి, రూ.2.50 కోట్ల విలువ చేసే 20 కిలోల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌.....

హాషిష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌ ముఠా ఆటకట్టు

  • రూ.2.50 కోట్ల విలువైన ఆయిల్‌ స్వాధీనం

వరంగల్‌ క్రైం, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఏపీలోని తుని నుంచి ముంబైకి గంజాయి నుంచి తీసిన హాషిష్‌ ఆయిల్‌ను తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి, రూ.2.50 కోట్ల విలువ చేసే 20 కిలోల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. మంగళవారం డీసీపీ కవితతో కలిసి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిసాకు చెందిన హంటల్‌ సన్ను, హంటల్‌ సన్యాసి, కృష్ణ హంటల్‌, కిలో పాండు, ఏపీలోని అల్లూరి జిల్లా బరికొండకు చెందిన కండెల చిన్నబాబులు పరిచయస్తులు. వీరంతా హాషిష్‌ ఆయిల్‌ను ముంబై లో విక్రయించేందుకు రైలులో బయల్దేరారు. ముందస్తు సమాచారం మేరకు వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 20 కిలోల హాషిష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకోగా, మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నాడన్నారు. కాగా, హైదరాబాద్‌లో గంజాయి సాగు చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీహెచ్‌.శశిధర్‌ తన ఇంటి డాబాపైనే ఆ మొక్కల పెంపకాన్ని ప్రారంభించాడు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు నాచారంలోని నిందితుడి ఇంటిని తనిఖీ చేసి.. 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో మేడపాటి నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:44 AM