Share News

క్వింటాలుకు 8 నుంచి 10 కేజీల కోత

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:43 PM

అధికా రులు, మిల్లర్లు కుమ్మకై కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లులో క్వింటాలుకు అదనంగా 8 నుంచి 10 కేజీలు తరుగు పేరుతో కోత విధిస్తున్నారని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.

క్వింటాలుకు 8 నుంచి 10 కేజీల కోత
రామాపురంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం

- కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

పెంట్లవెల్లి జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : అధికా రులు, మిల్లర్లు కుమ్మకై కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లులో క్వింటాలుకు అదనంగా 8 నుంచి 10 కేజీలు తరుగు పేరుతో కోత విధిస్తున్నారని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌ మండలం రా మాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తేమ, తాలు పేరుతో సా కులు చెప్పి బస్తాలలో ఎక్కువ తూకం వేయిం చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం మిల్లర్లతో కు మ్మకై రైతులను దోపిడీ చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ప్రభు త్వంపై పోరాటం కొనసాగి స్తామని అన్నారు. ఈ కార్యక్ర మంలో కొల్లాపూర్‌ నియోజక వర్గ నాయకులు సురగౌని నిరం జన్‌గౌడ్‌, రామాపురం సర్పంచు కొమ్మ గోపాల్‌యాదవ్‌, ఉప స ర్పంచు పరశురాముడు, మాజీ ఎంపీపీ నరేంద ర్‌రెడ్డి, నాయకులు దర్గయ్య, బాలయ్య, కురుమ య్య, నిరంజన్‌, నాగరాజు పాల్గొన్నారు.

పెద్దమ్మ దేవతకు పూజలు

కోడేరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : మండల ప రిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో ఆదివారం గ్రా మ దేవత పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశా రు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు మాజీ తాజా ప్రజాప్రతి నిధులు హాజరై పెద్దమ్మ దేవతకు ప్రత్యేక పూ జలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ న ర్సాయిపల్లి గ్రామంలో పెద్ద దేవర్ల పండుగ జరు పుకోవడం సంతోషకరమని, అమ్మవారి ఆశీర్వా దం గ్రామ ప్రజలపై ఎల్ల వేళలా ఉండాలని ఆ యన అన్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:43 PM