Share News

Harish Rao Slams Revanth Reddy: అణచివేయడమే రేవంత్‌ పాలసీ

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:04 AM

ప్రజాస్వామ్యమే తమ ఏడవ గ్యారంటీ అని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేయడమే తన పాలసీగా పెట్టుకున్నారని హరీశ్‌ విమర్శించారు.

Harish Rao Slams Revanth Reddy: అణచివేయడమే రేవంత్‌ పాలసీ

  • సికింద్రాబాద్‌ అస్తిత్వం కోసం పోరాటం ఆగదు: హరీశ్‌

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యమే తమ ఏడవ గ్యారంటీ అని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేయడమే తన పాలసీగా పెట్టుకున్నారని హరీశ్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సాధన కోసం తమ పార్టీ నాయకుడు తలసాని ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్‌ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటని శనివారం ఎక్స్‌వేదికగా హరీశ్‌ విమర్శించారు. అరెస్టయిన వారిని విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 18 , 2026 | 05:04 AM