Share News

బీఆర్‌ఎస్‌ హయాంలోనూ సృజన్‌రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:16 AM

సిట్‌ విచారణలో వాస్తవాలు బయటికి వెల్లడి కాకుండా హరీశ్‌రావు ట్రిక్కులు ప్లే చేస్తున్నారని, ఇందులో భాగంగానే సృజన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ....

బీఆర్‌ఎస్‌ హయాంలోనూ సృజన్‌రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు

  • సిట్‌ విచారణలో వాస్తవాలు చెప్పకుండా.. హరీశ్‌రావు ట్రిక్కులు: ఎంపీ చామల

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : సిట్‌ విచారణలో వాస్తవాలు బయటికి వెల్లడి కాకుండా హరీశ్‌రావు ట్రిక్కులు ప్లే చేస్తున్నారని, ఇందులో భాగంగానే సృజన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ ఆరోపిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనూ సృజన్‌రెడ్డికి, ప్రతిమా శ్రీనివాస్‌, హర్ష, సుధాకర్‌రెడ్డిలకూ కాంట్రాక్టులు ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి సృజన్‌రెడ్డి స్వయాన అల్లుడన్నారు. తన అల్లుడు సృజన్‌రెడ్డిని ఎందుకు బద్నాం చేస్తున్నారంటూ గతంలోనే కేటీఆర్‌ను కందాల ఉపేందర్‌రెడ్డి ప్రశ్నించారని గుర్తుచేశారు. సృజన్‌రెడ్డి తనకు దూరపు బంధువంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేటీఆర్‌, హరీశ్‌రావుల బంధువులకు సింగరేణి కాంట్రాక్టులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. వారిలాగా దోచుకునే ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. 2014 నుంచి 2026 వరకు సింగరేణిలో ఏం జరిగిందో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాలంటూ కేటీఆర్‌, హరీశ్‌రావులకు సూచించారు. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికీ లేఖ రాయాలన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 05:16 AM