Share News

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:43 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు సోదరుడైన తనపై ఇసుక మాఫియా నడిపారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ....

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

  • ఎక్స్‌లో హరీశ్‌రావు సోదరుడు మహేశ్‌

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు సోదరుడైన తనపై ఇసుక మాఫియా నడిపారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై తన్నీరు మహేశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సీఎం చేసిన ఆరోపణలను మహేశ్‌ తోసిపుచ్చారు. ‘నాకు ఎలాంటి ప్రమేయం లేని విషయంలోకి నన్ను అనవసరంగా లాగారు. మరి ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు నేను అసెంబ్లీకి ఎంటర్‌ కావాలా?’ అంటూ ఆయన ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్‌ అమెరికాలో స్థిరపడినప్పటికీ గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా మహేశ్‌ చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో ఆయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరందుకుంది.

Updated Date - Apr 01 , 2026 | 04:43 AM