Share News

రుణమాఫీపై హరీశ్‌ పిటిషన్‌ ఉపసంహరణ

ABN , Publish Date - May 01 , 2026 | 05:17 AM

సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు రుణమాఫీ పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖ లు చేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు సూచన మేరకు ఉపసంహరించుకున్నారు.

రుణమాఫీపై హరీశ్‌ పిటిషన్‌ ఉపసంహరణ

  • హైకోర్టులో నేడు పిల్‌ దాఖలు చేస్తాం: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు రుణమాఫీ పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖ లు చేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు సూచన మేరకు ఉపసంహరించుకున్నారు. రైతులందరి తరఫున ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాలే గానీ, రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయడానికి వీలులేదన్న ప్రభుత్వ అభ్యంతరాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిల్‌ను దాఖలు చేసుకునే అవకాశం ఇస్తామని, పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్న హైకోర్టు సూచించగా.. హరీశ్‌ తరపు న్యాయవాది అంగీకరించారు. దీంతో రిట్‌ పిటిషన్‌ను కొట్టి వేస్తూ, పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూ న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో రైతులకు రుణాలను మాఫీ చేయడం లేదన్న అంశం వ్యక్తిగతమైనది కాదని, రిట్‌ పిటిషన్‌ ద్వారా ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపారు. కాగా, కోర్టు సూచన మేరకు రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని, ఇదే అంశంపై శుక్రవారం పిల్‌ను దాఖలు చేస్తామని హరీశ్‌రావు తెలిపారు.

Updated Date - May 01 , 2026 | 05:17 AM