ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - May 26 , 2026 | 04:24 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని, కల్లాల్లో రైతుల ధాన్యాలకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
లేదంటే కలెక్టరేట్లను దిగ్బంధిస్తాం.. సీఎంకు హరీశ్ లేఖ
హైదరాబాద్/సిద్దిపేట అర్బన్, మే 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని, కల్లాల్లో రైతుల ధాన్యాలకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు కాదని, రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సోమవారం ఆయన సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. తరుగు లేకుండా కొనాలని, లారీలు, గన్నీ బ్యాగులు పంపాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తానే స్వయంగా వేలాది మంది రైతులతో వెళ్లి సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. మరోవైపు పెట్రో ధరల పెంపుపై సీఎంకు హరీశ్ బహిరంగ లేఖ రాశారు.