సీఎం, హోంమంత్రిగా రేవంత్ అట్టర్ ఫ్లాప్..!
ABN , Publish Date - May 09 , 2026 | 06:40 AM
ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్ర హోంశాఖ మంత్రిగానూ రేవంత్ విఫలమయ్యారని, తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని...
దేశంలో అత్యధికంగా 27,230 సైబర్ నేరాల నమోదు
ఎన్‌సీఆర్‌బీ నివేదికతో బయటపడిన నేరాల రేటు: హరీశ్
హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్ర హోంశాఖ మంత్రిగానూ రేవంత్ విఫలమయ్యారని, తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. 2024 ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా మారడం ఆందోళనకరమన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. సీపీ సుమతి నిర్వహించిన ఆపరేషన్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బయటపడిందని, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షలు నిర్వహించడం మాత్రమే కాకుండా, క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్‌రావు సూచించారు.