Share News

వ్యవసాయ శాఖపై రేవంత్‌ మొక్కుబడి సమీక్ష

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:42 AM

పంట బోన్‌సకు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ శాఖపై మొక్కుబడి సమీక్ష నిర్వహించారని బీఆర్‌ఎస్‌ నేత..

వ్యవసాయ శాఖపై రేవంత్‌ మొక్కుబడి సమీక్ష

  • ధాన్యం బోన్‌సను ఎత్తేసేందుకు కుట్ర: హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : పంట బోన్‌సకు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ శాఖపై మొక్కుబడి సమీక్ష నిర్వహించారని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఒక ప్రకటనలో ఆరోపించారు. రైతు బంధు, పంట బోనస్‌, పంట బీమా, రైతు బీమా గురించి సమీక్ష చేయకపోవడం.. రైతు సంక్షేమాన్ని విస్మరించడమేనని ధ్వజమెత్తారు. ధాన్యం బోనస్‌ నుంచి తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటని విమర్శించారు. ఏడు రకాల ధాన్యానికే బోనస్‌ ఇస్తామంటే.. ఇప్పటికే నారు వేసిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై సీఎం సమీక్ష నీళ్లు చల్లిందని పేర్కొన్నారు. ఎన్నికలు లేకుంటే రైతు భరోసా ఇవ్వరా? అని నిలదీశారు. సీజన్‌కు ఒక రకంగా వ్యవహరిస్తూ రైతులను ఎందుకు గందరగోళం చేస్తున్నారో అర్థం కావడం లేదని, పంట బీమా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్‌లో చెప్పి రెండేళ్లయినా అమలు చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

Updated Date - Jun 17 , 2026 | 04:42 AM