జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు?:హరీశ్
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:56 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 19,604 జీవోలు ఇచ్చారని, వీటిని ఎందుకు ఆన్లైన్ చేయట్లేదని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్...
హైదరాబాద్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 19,604 జీవోలు ఇచ్చారని, వీటిని ఎందుకు ఆన్లైన్ చేయట్లేదని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శాసనసభలో ప్రశ్నించారు. 80 శాతానికి పైగా జీవోలను సీక్రెట్‌గా పెట్టారని, జీవోలను దాయాల్సిన అవసరమేముందన్నారు. ఉద్యోగుల పీఆర్సీపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ పొడిగింపు మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను 6నెలలకొకసారి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలా సమన్వయం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించగలరని హరీశ్ రావు ప్రశ్నించారు. వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పన్నులు భారీగా పెంచారని, పొట్టకూటి కోసం ట్రక్కులు, ఆటోలు కొనుక్కునే వారికి భారం అవుతోందన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు మార్చడానికే పోలీసు కమిషనరేట్‌లు మార్చారని హరీశ్‌రావు ఆరోపించారు.