రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్ కనిపించట్లేదా?
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:59 AM
ఎలాంటి డీపీఆర్, ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం వెనుక....
రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నిలదీత
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి డీపీఆర్, ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం వెనుక ఉద్దేశం ఏమిటని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బుల్డోజర్‌రాజ్ రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడం లేదన్నారు. ఇప్పటికే చాదర్‌ఘాట్‌లో 300ఇళ్లు కూల్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడానికి కాంగ్రెస్ నేతలు స్టార్ హోటల్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన అంటూ సీఎం లక్ష కోట్ల రూపాయల లూటీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.