ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులా..?
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:44 AM
‘ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులా..? హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. మీరు చెప్పుకొంటున్న ప్రజాపాలన ఇదేనా..? రేవంత్‌రెడ్డి.. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వ పాలనా..? లేదంటే..
ఇది ప్రభుత్వ పాలనా.. పోలీసు పాలనా?: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ‘ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులా..? హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. మీరు చెప్పుకొంటున్న ప్రజాపాలన ఇదేనా..? రేవంత్‌రెడ్డి.. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వ పాలనా..? లేదంటే.. పోలీసు పాలనా?’ అంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని సూర్యాపేటలో కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై సీఐ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ‘మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటు కాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు.. తమకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్న ప్రజలపై జులుం ప్రదరిస్తూ.. దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా డీజీపీ శ్రద్ధ చూపాలి.’ అని హరీశ్ డిమాండ్ చేశారు.