Share News

అరాచకాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: హరీశ్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:50 AM

‘ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నిస్తే కేసు పెడతారా...? రేవంత్‌ మూర్కత్వం హిట్లర్‌ని మించిపోయింది’ అని బీఆర్‌ఎ్‌సఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.

అరాచకాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: హరీశ్‌

కంది, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నిస్తే కేసు పెడతారా...? రేవంత్‌ మూర్కత్వం హిట్లర్‌ని మించిపోయింది’ అని బీఆర్‌ఎస్ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురు కార్యకర్తలను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, మాణిక్‌రావులతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రిశాంక్‌ను జైల్లో పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి వికృత ఆనందం పొందుతున్నారని, వారందరిపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.

Updated Date - Apr 29 , 2026 | 06:52 AM