Share News

మా దెబ్బకు సీఎం సోయికొచ్చిండు..

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:43 AM

దేవాదులను పూర్తి చేయడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా హరీశ్‌రావు వరంగల్‌ పాత...

మా దెబ్బకు సీఎం సోయికొచ్చిండు..

మేం దేవాదులను సందర్శించినాక హడావుడి: హరీశ్‌రావు

వరంగల్‌ మెడికల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : దేవాదులను పూర్తి చేయడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా హరీశ్‌రావు వరంగల్‌ పాత సెంట్రల్‌ జైలు స్థలంలో జరుగుతున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమ దెబ్బకు సోయి వచ్చి సీఎం హడావుడిగా దేవాదుల ప్రాజెక్టును సందర్శించాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను కావాలని నత్తనడకన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులను రేవంత్‌రెడ్డి సర్కార్‌ చిన్నచూపు చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 25 , 2026 | 01:43 AM